బెంగాల్‌లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!

కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు 63.66 లక్షలకు చేరింది. అదేవిధంగా మరో 60 లక్షలకుపైగా ఓటర్లను ‘పరిశీలన’ కేటగిరీలో చేర్చింది. ఈ ఓటర్ల వివరాలను జ్యుడిషియల్ అధికారులు తనిఖీ చేయనున్నారు.మొత్తం 7.66 కోట్ల మంది ఓటర్ల జాబితాతో గతేడాది నవంబరు 4న బెంగాల్‌లో ఎసఐఆర్ ప్రక్రియ మొదలైంది. డిసెంబరు 16న ముసాయిదా జాబితాను విడుదల చేశారు. మరణాలు, వలసలు, నకిలీల వంటి కారణాలతో 58 లక్షల ఓట్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 7.08 కోట్లకు చేరింది. విచారణలు, పరిశీలనలు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం.. ఫారం`7 ద్వారా దాదాపు మరో5.46 లక్షల ఓట్లు తొలగించారు. ఫారం`6, ఫారం`6ం ద్వారా 1.82 లక్షలకు పైగా ఓటర్లను చేర్చారు. దీంతో ప్రస్తుతం మొత్తం ఓటర్ల సంఖ్య 7.04 కోట్లకు చేరింది. ఇప్పటివరకు దాదాపు 6.4 కోట్ల మందిని ఆమోదిత జాబితాలో చేర్చారు. తుది జాబితా విడుదలైన తర్వాతే గణాంకాలపై నిర్ధరణకు రావొచ్చని అధికారులు తెలిపారు. అప్‌డేట్ చేసిన ఓటర్ల జాబితాల ప్రతులను జిల్లాల్లోని ఎస్‌డీవో, బీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపుర్‌లో ఇప్పటివరకు 47 వేల ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది. మరో 14 వేలమందిని ‘పరిశీలన’ జాబితాలో చేర్చారు. ఎసఐఆర్ ప్రక్రియకు ముందు ఇక్కడి ఓటరు జాబితాలో 2.06 లక్షల మంది ఉన్నారు. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ స్థానికంగా ‘ఎసఐఆర’ ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది.