సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 03(జనంసాక్షి):మంగళవారం నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ నితికా పంత్ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. హానికరమైన రసాయనిక రంగులు వాడరాదు అని అన్నారు. సహజ రంగులకే ప్రాధాన్యం ఇవ్వాలి అని అన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం నిషేధమని స్పష్టం చేశారు. ప్రజా ప్రదేశాల్లో అవాంఛనీయ ప్రవర్తనకు అనుమతి లేదు అని అన్నారు.
ప్రార్థనా మందిరాలు, రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనదారులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. మహిళల పట్ల మర్యాద తప్పనిసరి అని ధరించారు. వేధింపులపై కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్‌లు ప్రత్యేకంగా మోహరింపు, ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు,
పండుగ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, ఉల్లంఘనలకు ఎలాంటి సడలింపులు ఉండవని హెచ్చరించారు. అతివేగం ప్రమాదకరం అని, యువత అప్రమత్తంగా ఉండాలి అని,
రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రమాదాలపై అప్రమత్తత అవసరం అని అన్నారు.
ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లవద్దని, పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారం, గొడవలు సహించబోవు అని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అపోహలు వ్యాప్తి చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి, పరస్పర గౌరవంతో, సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొవాలని జిల్లా ఎస్పీ కోరారు.



