బతుకులు బుగ్గి

` బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
` ఘటనలో 21మంది మతి…పలువురికి గాయాయాలు
` సామర్లకోట సవిÖపంలోని వేట్ల పాలెం వద్ద ఘటన
` పేలుడు ధాటికి దట్టంగా అలముకున్న పొగ
` 5 కి.మీ వరకు పేలుడు శబ్దాలు వ్యాప్తి
` పేలుడు ఘటన తరవాత యజమాని పరార్
` పొలాల మధ్య షెడ్డులో తయారీ కేంద్రం
` బురదమయంగా ఉండడంతో ఫైరింజన్ల రాక కష్టం
` పేలుడు ఘటనపై చంద్రబాబు దిగ్భాంతి
` సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాం
` ఘటనపై ప్రధాని మోదీ సంతాపం
` మతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని
కాకినాడ,ఫిబ్రవరి28(జనంసాక్షి): కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోవిÖటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న పైవేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పేందుకు 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు సంభవించినప్ప్పుడు భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకున్నప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనాస్థలిలో శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. మతుల్లో ఇప్పటి వరకు 11 మందిని పోలీసులు గుర్తించారు. మతులను అడబాల శ్రీను, కడింపల్లి కపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు పేర్కొన్నారు. ఇంకా కొద్ది మంది మతదేహాలను గుర్తించాల్సి ఉంది. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి మతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అలాగే ఈ ప్రమాదంలో అనేమంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు సమయంలో మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పేలుడు శబ్దం విని స్థానికులు భారీగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో మతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
పేలుడు ఘటనపై చంద్రబాబు దిగ్భాంతి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై ఆరా తసిన సిఎం అధికారులతో మాట్లాడారు. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన గురించి అధికారులు తెలియజేశారు. దీంతో విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు… ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్‌లో 20 మంది వరకు పని చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లోనూ స్పందించారు సీఎం. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భాంతిని కలిగించిందన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించామని చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. కార్మికుల మతిపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీఎం పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న ఆమె.. హుటాహుటీన సంఘటన స్థలికి బయల్దేరి వెళ్లారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఎప్పటికప్ప్పుడు మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సమాచారం తెలిసి తీవ్ర దిగ్భాతికి గురయ్యాను. పలువురు మత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మతులకు నివాళులు అర్పిస్తున్నాను. మతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పేలుడు ఘటనపై ఇంఛార్జి మంత్రి నారాయణ తీవ్ర దిగ్భాతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘటనాస్థలికి వైద్యులను పంపించి తక్షణ వైద్యసాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
పేలుడు ఘటన తరవాత యజమాని పరార్
పొలాల మధ్య షెడ్డులో తయారీ కేంద్రం
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటనపై ఆర్‌డీవో మల్లిబాబు స్పందించారు. పేలుడు ఘటన తర్వాత యజమాని పరారీలో ఉన్నాడని విÖడియాకు వివరించారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయని అందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని, మరోవైపు కాకినాడ జీజీహెచ్‌లో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వేట్లపాలెం వాసి కప్పా వెంకట లక్క్ష్మి, పెద్దాపురం వాసి మోర్తా శ్రీను, సామర్లకోటకు చెందిన కె. శ్రీను, చిటికెల లక్క్ష్మి ఉన్నారు. పొలాల్లో 6 షెడ్లు వేసి బాణసంచా తయారుచేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పేలుడుకు ముందు కొందరు కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లారు. దీంతో వారు ప్రాణాలు దక్కించుకున్నారు. పేలుడు శబ్దానికి వేట్లపాలెం గ్రామంలో ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో పేలుడు ఘటన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. ప్రమాద తీవ్రత పెరగడానికి అక్కడి పరిస్థితులే కారణమని స్థానికులు చెబుతున్నారు. అతి తీవ్రస్థాయిలో విస్ఫోటనం జరగడం, రెండు గంటలపాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించే ప్రాంతానికి చేరుకునే సరికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడికి ఫైరిరజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరిపొలాలు బురద మయంగా ఉండటం వల్ల వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా చాలా సేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. ఘటనాస్థలి వద్ద పరిస్థితి భీతావహంగా మారింది. మంటల్లో కాలిపోయి, తీవ్రంగా గాయపడిన బాధితులను అతికష్టం విÖద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.
వేట్లపాలెంలో పేలుడు.. మతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని
సామర్లకోట: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్రగ్భ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.