ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం

` మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా
` బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత
హైదరాబాద్(జనంసాక్షి): ఈ ప్రభుత్వం విÖది.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.. విÖకు అండగా ఉంటామంటూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మదీనాలో ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే మంత్రి అజహరుద్దీన్ నేతత్వంలోని ప్రతినిధి బందాన్ని మదీనాకు పంపామని సీఎం గుర్తు చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి మదీనా పంపించామన్నారు. అక్కడి భారత్ కాన్సులేట్, సౌదీ ప్రభుత్వంతో చర్చించి మతిచెందిన వారి అంత్యక్రియలు జన్నుతుల్ బఖీలో చేయించామన్నారు. సహజంగా దేశం బయట జరిగే ప్రమాదాల్లో మతిచెందిన వారికి ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని.. కానీ తాము మాత్రం మానవతా దక్పథంతో సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల నాంపల్లి అగ్నిప్రమాదంలో మతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించామని సీఎం తెలిపారు. ఈ చెక్కులను ఇళ్లకు పంపించవచ్చని.. కానీ విÖ అందరితో కలవాలని… విÖకు అండగా ఉంటామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే సచివాలయానికి పిలిపించామని సీఎం అన్నారు. అనంతరం ప్రమాదంలో మతిచెందిన 44 కుటుంబాల వారికి రూ.5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.I ముస్లిం సోదరులతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009 సంవత్సరం నుంచి నియోజకవర్గంలోని అయిదు మండలాల నుంచి ఒకొక్కరి చొప్పున ఏటా అయిదుగురిని తన సొంత ఖర్చులతో హజ్ యాత్రకు పంపుతున్నానని సీఎం తెలిపారు. వారిని ఎంపిక చేసే బాధ్యత స్థానిక ముస్లిం మత పెద్దలకే అప్పజెప్పానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రో పాషా, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ ఛైర్మన్ ఫహీం ఖురేషి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

జల మండలికి శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు
` ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి): కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జలమండలికి శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. పీఠం భూముల్లో జలమండలి చేపట్టిన నిర్మాణ పనులను శారదాపీఠం ప్రతినిధులు సీఎం దష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో అక్కడి నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి కేటాయింపులను రద్దు చేసి.. పీఠానికే ఆ భూములను కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని శారదాపీఠం ప్రతినిధులకు సూచించారు.

 

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు. 2019లో జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా, అప్పటి ఎంపీలైన రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున భారీ ర్యాలీ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ర్యాలీలో సుమారు 40 కార్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లతో ప్రచారం నిర్వహించారని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక 2021లో కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఓ పబ్లిక్ విÖటింగ్‌లో పాల్గొన్నారని కూడా రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ సమయంలో ప్రజా సమావేశాలపై పరిమితులు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, కోవిడ్ మార్గదర్శకాలు పాటించకపోవడం వంటి అంశాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణలో భాగంగా నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కోర్టు విచారణలో తదుపరి విచారణ తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. కేసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారం, కోవిడ్ సమయంలో జరిగిన సమావేశాలకు సంబంధించి చట్టపరమైన పక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.