కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి…
చెన్నారావుపేట నుండి కాంగ్రెస్ లో చేరిక…
కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి…
చెన్నారావుపేట, మార్చి 2( జనం సాక్షి): కాంగ్రెస్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం చెన్నారావుపేట గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కంది శ్వేత భర్త బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి కంది కృష్ణ చైతన్య రెడ్డి, మాజీ సర్పంచ్ హంస విజయరామరాజు, జున్నుతుల మహేందర్ రెడ్డి, అడుప అశోక్, హంస సాంబయ్య, మహేందర్, గుంటి బిక్షపతి, ఉప్పునూతుల రాజు, మరాటి రాజు, మంద ముక్తేశ్వర్, కుండె సురేష్, కిరణ్, సాగర్, దర్శి, మున్నాలతో పాటు మరి కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప అభివృద్ధి చేయడంలో విఫలం చెందారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ లో చేరుతున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ చేరకుండా ఆమె భర్త చేరడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేష్, యూత్ మండల అధ్యక్షులు బండి హరీష్, మాజీ వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, రాధారపు ప్రతాప్ రెడ్డి, కుండె కుమారస్వామి, బొంత శ్రీనివాస్, వనపర్తి శోభన్, గుగులోతు ఈర్య, నాని, తదితరులు పాల్గొన్నారు.


