ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన పోచంపల్లి మున్సిపల్ పాలకవర్గం

 

 

 

 

 

పోచంపల్లి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో అదనపు బస్సులకు హామీ

భూదాన్ పోచంపల్లి, మార్చి 3 (జనం సాక్షి): భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలను భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మున్సిపల్ పాలకవర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా చైర్మన్ తడక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోచంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకు అదనపు బస్సులు నడపాలని ఎంపీని కోరగా, ఆయన వెంటనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి తో ఫోన్‌లో మాట్లాడి రెండు అదనపు బస్సులు నడపాలని కోరినట్లు తెలిపారు. దీనికి సానుకూల స్పందన లభించినట్లు చెప్పారు. అలాగే పారిశ్రామిక ప్రాంతం కావడంతో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ద్వారా ప్రత్యేక బస్సులు నడపాలని కూడా ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు కొండమడుగు ఎల్ల స్వామి, శ్రీరామ్ మంజుల లింగస్వామి యాదవ్, జినుకల లావణ్య యాదగిరి, దేవరాయ కుమార్, రావుల జంగయ్య, పట్టణ అధ్యక్షులు భారత లవ కుమార్, నాయకులు గునిగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు