అప్పుల ఊబిలో మహిళ సాధికారత

గత కొద్ది నెలలుగా మైక్రో ఫైనాన్స్‌ కి బలి అవుతున్న మహిళలను కుటుంబాలను చూస్తున్నం ఇంకా బలి పీఠం పై ఎక్కడానికి సిద్దంగా ఎంద మంది ఉన్నారో తెలవదు. పోయిన సంవత్సరం ఒక్క రోజే కరీంనగర్‌లో ఒక మహిళ ఆత్మహత్యాప్రయత్నం, వరంగల్‌లో ఒక ఆటో డ్రైవర్‌ ఎస్‌కెఎస్‌ అనే సంస్థ అప్పు ఒక వారం తీర్చలేదని వేదింపులు భరించలేక ఆత్మహత్యచేసుకున్నాడు. ఆదేవిధంగా రాజమండ్రిలో కూడా ఒక మహిళాఆత్మహత్య చేసుకుంది. అసలు పేపర్లకు పోలీసు స్టేషన్లకు చేరని చావులు ఎన్నో ! ఇన్ని చావులకు కారణం అయిన మైక్రో ఫైనాన్స్‌ సంస్థల గురించి ఆ ఊబిలో చిక్కుకున్న అధిక శాతం మహిళల గురించి నేడు చర్చినక తప్పని పరిస్తితి పావలా వడ్డి అని మహిళలు జీవితాలను మేమే బాగుచేస్తున్నామని వెర్రవీగే ప్రభుత్వాలకు ఈ చావులకు మైక్రో ఫైనాన్స్‌ పెట్టే హింసలు కనపడవు కాబోలు! సూక్ష్మరుణ సంస్థల వలన ఒరిగే లాబాలు ఏమోకాని నష్టాలు గురించి అనేక మంది మేధావులు ఇది వరకి ప్రస్తావించారు. కరీంనగర్‌ మెదక్‌,జిల్లాలలో వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా మొదలు అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా వీటిపై గతి లేక ఆధార పడ్డ కొందరి పరిస్తితి ఆందోళనగా ఉండి లెఫ్టర్‌ పార్టీలు కొంత కొట్లాడుతున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అపుడపుడు కొంద మంది రాజకీయ నాయకులు కూడా వీటి గురించి మాట్లాడడం మొదలు పెట్టారు విచిత్రంగా అందరు మాట్లాడే వారేతే ఇక సమస్యని పరిష్కరిన్చే వారేవరు అనేదే ప్రశ్న

ఇంక మైక్రో ఫైనాన్స్‌ నేపధ్యం గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే, 1700 దశకం లోనే యూరప్‌ దేశాలల్లో ప్రారంభమై , ఆతరువాత 1970లలో బంగ్లాదేశ్‌ ఇతర అనేకదేశాలలో రకరాకల పేర్లతో కారణాలతో రుణాలను ఇచ్చే సంస్థలు మొదలైనాయి, గ్రూప్‌ మొత్తాన్ని బాధ్యులుగా చూస్తు ఒక వ్యక్తి రుణం తీసుకుంటే మిగిలిన వారు పూచికట్టు ఇచ్చే విధంగా అందరికి బాద్యత వహించే విధంగా రుణాలు ఇచ్చే సంస్థలు ఉప్పెనలాగా దూసుకోచ్చాయి, అందరు అనుకునే విధంగా సూక్ష్మరుణాలు, సస్థలు కొత్తగా వచ్చినవి కావు కొన్ని దశాబ్డాలుగా ప్రాచుర్యంలో ఉన్న వే అయితే వీటికి అంతర్జాతీయ ప్రాముఖ్యతను ఆపాదించి ప్రభుత్వరంగా కొన్ని పథకాలను ప్రవేశ పెట్టడానికి దారితీసింది. మాత్రం 1975 మెక్సికో అంతర్జాతీయ మహిళా సదస్సు ఇందులో ముఖ్యంగా మహిళలు రుణా సౌకర్యాలను, బ్యాకింగ్‌ వ్యవస్థని అందుకోలేని పరిస్థితి లో ఉన్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచే వుమెన్‌ వరల్డ్‌ బ్యాకింగ్‌ నెట్‌ వర్క్‌ స్టార్‌ అయింది. 1980 నుంచి అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు జమ అప్పులు కాన్సెప్ట్‌ తోటి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా మహిళలకి ఆర్థిక లావాదేవిలలో అవకాశం కలిపించి వచ్చని తీర్మానించాయి. ఈదారిలోనే 1985 నైరోబి అంతార్జాతీయ మహిళ సదస్సులో కూడా ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. 1980-90 మైక్రో ఫైనాన్స్‌ అతి వేగంగా పేదరిక నిర్మూలన దిశాగా పరుగులు తీసింది. మిలియినం డెవలప్మ్‌ట గొల్ఫ్‌ ఎండీజీ కూడా మహిళల స్థితి ఆర్థిక స్వావలంబనతో చూస్తూ కొన్ని ప్రమాణాలను రూపోందించారు. పైకి మహిళల ఆర్థిక స్థితి మెరుగు పరచాడానికి గ్రామీణ వ్యవస్తని ఆర్ధికంగా బాగు చేయడానికి అని అనేక పేర్లతో ముందుకొచ్చే మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ముఖ్యంగా గురి పెట్టేది మహిళల పైననే మైక్రో పైనాన్స్‌ కి జెండర్‌ కి సంబంధం గురించి చెప్పాలంటే ఈ సంస్థలు డబ్బుని మహిళలను కేంద్రంగా పెట్టుకుని తమ వ్యాపారలను నడిపించడం మొదలు పెట్టాయి దీనికి కారణం మహిళలు కుటుంబాలకు బాద్యత వహిస్తారని ఇతురులంటే బాధ్యత తో రుణాలు వడ్డీ చెల్లిస్తారని ఇదే కాకుండా మహిళలు ఆర్ధిక లావాదేవిలతో తాము కూడా ఆర్దిక ంగా నిలబడాతరని కొద్దికాలం తరువాత తెలుసుకున్నట్టు చేసి దీనికి మహిళా సాధికరతే అని నామకరణం చేసినారు. అసలు సాధికరత అంటే కేవలం ఆర్థిక అవసరాలతో ముడిపడి ఉన్న ఒక అంశం అని అనుకోవడమే పొరపాటు అయితే ఆర్థికంగా నిలదొక్కుకుంటు స్వతంత్య్రంగా తమ కాళ్ల మీద తాము నిలబడి దైర్యంగా ఉంటారనేది మాత్రం ఒక అంశం ఔత్సాహకం పరిశోధకులు మహిళ సాధికరతని రకరకలుగా నిర్వచించారు. అందులో ముఖ్యంగా ఆర్థిక భద్రతా చిన్న పెద్ద కొనుగొలుతనం గృహానికి సంబంధించిన విషయాలలో నిర్నయాది కారం కనీసం భాగస్వామ్యం స్వతంత్య్రంగా బయటికి వెళ్లడం రాజకీయ న్యాయ సంబంధిత విషయాలలో అవగాహన మొదలగునవి వీటిలో సగానికి పైగా మహిళలు పొందగలిగినవి ఉంటే చేరగలిగి ఉంటే సాధికరత దిశగా అడుగులు వేస్తున్నాట్టు కొన్ని కొలమానాలు పెట్టుకుని వాటిని ఆర్థిక వెసులుబాటుతో పాటు సమీక్షిస్తు ఈ మైక్రో ఫైనాన్స్‌ ని ప్రోత్సహిస్తు ముందుకు పోయారు. వీటిని చూసి స్వయం సహకారం గ్రూపులను ప్రభుత్వాలను ప్రోత్పాహిస్తు వచ్చాయి. అందులో ఆర్థిక స్వాలబంనని చేర్చాయి. చిన్నచిన్న రుణాలని పేదరికం దిగువ ఉన్నవారికి ఇవ్వడం మొదలు పెట్టాయి. ఇక రాజకీయ కోణంతో చూస్తే ఈ బృందాలని కులాల వారీగా ప్రాంతాల వారీగ ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా విడకొట్టి రాజకీయ పార్టీలకి అనువుగా మార్చుకున్నారు. జీవితాలు బాగు పడతాయని అప్పులలో చిక్కుకుని తనతో పాటు అనేకమందిని ఈ విషవలయంలో లాగి వేరేదారి లేక పేదలు మహిళలు వారు ఆడిపించినట్లు ఆడూతూ అల్లాడిపోతున్నారు. కొన్ని దేశాలలో ఈ మైక్రో ఫైనాన్స్‌ ఆఫీసులు ప్రభుత్వాలకంటే పెద్ద వ్యవస్థఆ ఏర్పడి అంతకంటే ఎక్కువ లే సమానమైన సిబ్బందితో పనిచేస్తున్నాయి ఉధాహరణకి సేవా అనే సంస్థ (సెల్ఫ్‌ ఎంప్లాయిస్‌ ఉమెన్స్‌ అసోషియేషన్‌) 1973లో గుజరాత్‌ లో మొతలైంది. దీని ముఖ్య ఉద్దేశ్యాలు మహిళల ఆదాయం ఉపది సామాజిక భధ్రతా 30,000 మంది మహిళలతో మొదలైనేడు దాదాపు 4 మిలియన్లుకు పైగా సభ్యులను పెంచుకున్నారు. అలాగే బంగ్లాదేశ్‌ లోని డాక్టర్‌ యూనస్‌ మొదలు పెట్టిన గ్రామీణ బ్యాంకు సంస్థ కూడ కొంత అభివృధ్దిని చూపించి అనేక సంస్థలకు దారిని చూపించాయి. నేడు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాలకు సమాంతరంగా ఈ సంస్థలు నడుస్తున్నాయి..కాలం గడుస్తున్న కొద్ది, సంస్థల ఉద్దేశ్యాలు మారి పోయి, కేవలం ఆర్థిక లావాదేవీలతోనే సరిపెట్టుకొని, వ్యాపార దృష్టితో మాత్రమే సని చేయడం మెదలు పెట్టాయి,. ఇంక ఈ సంస్థలు అంతర్జాతీయ సంస్థల అండతో, తమకు అనుగుణంగా పని చేసే వాళ్ళను తమ సంస్థలతో పెట్టుకొని, అమాయకులకు వల వేస్తూ తమ జేబులు నిమ్పుకొస్తున్నాయి. డబ్బుల వసూళ్ళ విషయంలో క్రూరమైన వడ్డీ వ్యాపారస్తులకంటే ఘోరంగా ప్రవర్తిస్తూ కుటుంబాల సరిస్థితులను చూడకుండా, వరదలు, తుఫాను లాంటి సందర్భాలను కూడా వదలకుండా, మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు. కొన్ని చోట్ల, వద్దన్నా వినకుండా అప్పులను ఇస్తున్నారు. ఒక్కపారి కిస్తు కట్టకపోయినా చచ్చే వరకు హింస పెడుతున్నారు. ఈ సంస్థల వ్యాపారులు సామాజిక విషయాలని పక్కన పెట్టి, ప్రొడక్షన్‌ లోన్లు కాకుండా, అభివృద్ధి కోసం కాకుండా, అవసరాల కోసం కన్సంప్షన్‌ లోన్ల వైపు మళ్ళాయి. వ్యవసాయం, బర్రెలు, గొర్రెలు కొన్నప్పుడు ఇన్ని మరణాలు తెచ్చుకుంటున్నారు అనే విషయం కూడా వాస్తవమే అయితే వాటి కోసం తమ ప్రాణాలను బలి పెట్టుకునేంత అవసరం లేదు అని పాపం వారికి తెలియదు. ఈ మహిళా బృందాలు 10 నుంచి 15 మందితో గ్రూప్‌గా ఏర్పడి, కేవలం అప్పుల ఖాతాలు, వడ్డీల లేఖలతో, బుక్కులు రాసే స్థితికి వచ్చాయి. డబ్బులు వసూలు కానప్పుడు మీటింగులలో విపరీతంగా తిట్టుకోవడం, అసహనం, కోపంతో శత్రుత్వం పెంచుకునే వరకు వచ్చాయి. వడ్డీలు విపరీతంగా పెంచాయి. కొన్ని ప్రదేశాలలో దాదాపు 30% నుంచి 100 % వరకు వడ్డీలను వడ్డిస్తున్నాయి. గ్రూప్‌ని ,మహిళల పొదుపుని ఆధారంగా, సెక్యూరిటీగా తీసుకొని సంస్థ కార్యాకలాపాలు సాగిస్తున్నారు.ఒక సభ్యురాలికి మిగిలిన వారందరూ కూడా భాద్యత వహిస్తారు.అదే ఈ సంస్థల అయువు పట్టు. అయితే పేద, అమాయక, చదువులేని మహిళలను టార్గెట్‌ చేసుకొని ఈ సంస్థలు సడపడం, ఇందులో ఉన్న ఓపాలను వారు గుర్తించలేకపోవడం, విపరీతమైన ఒత్తిడిని సభ్యులపు తేవడంతో అనేక మంది మహిళలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం వడ్డీ వ్యాపారస్తుల నడ్డి విరగ్గొడుతున్నాం అని, అప్పుల చెర నుంచి గ్రామాలను, పేదలను విడిపిస్తున్నాం అని సరికొత్త పథకాలతో ప్రభుత్వాలు ఈ సంస్థలకి ద్వారాలు తెరిచి పేదల, మహిళల బతుకులతో ఆడుకుంటున్నాయి.నేడు ప్రభుత్వాలే ప్రపంచ బ్యాంక్‌లో ప్రజలను, వారి జీవన విధానాలని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నాయి. సామాన్య ప్రజలకి అప్పులు తీసుకోవద్దని, జీవితాలు నాశనం చేసుకోవద్దని చేప్పే సరిస్థితిలో లేవు. ఈ మైక్రో రుణాల వల్ల మహిళల యూనిటీ, సాధికారత పక్కన పెట్టి తమ సంస్థల లాభ నష్టాలు చూసుకోవడానికి, వద్ధి చేసుకోవడానికి కృషి చేస్తున్నాయి. ఎప్పుడైతే లాభాలు దృష్టిలో పెట్టుకొంటామో అపుడు మానవ సంబందాలు దెబ్బ తింటాయని వాస్తవం. పేదరికం వెల్లూనుతున్న కొద్ది అప్పుల ఊబిలో కూరుకుపోతామనేది మరొక చేదు నిజం, మహిళలు కుటుంబాలపై ఉన్న ప్రేమ,మమకారాలు అప్పులవైపు నెట్టుతూ వారిని మరింత క్షోభ పెడుతున్నాయి. పరువుకు, మర్యాదకి తలవంచే ఈ మహిళలు, గుట్టుగా సంసార భారాన్ని మూస్తారు. కాని, బహిరంగ అవమానాలని కాదు, చిన్నచిన్న అవమానాన్ని కూడా భరించలేక, ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సంస్థలు కూడా రెచ్చి పోయి అప్పు తీసుకున్న వారిని హంసకు గురి చేస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు చాలా గ్రామాలలో ఇంటింటికి పోయి ముందు మనుషులను మచ్చిక చేసుకొని అప్పులలోకి లాగుతున్నాయి. ఆ తరువాత తమ అసలు రూపాన్ని బయట పెడుతున్నాయి. ఇప్పటివరకు కూడా అధ్యనాలు చెపుతున్నవి. ఈ వడ్డీలు కేవలం ఒక వంతు మాత్రమే జీవితాలను ప్రభావితం చస్తాయని, అది కూడా కాస్త ఉన్న కుటుంబాలనే, అతి నిరుపేద కుటుంబాలు వీటితో బాగు పడినవి చాలా తక్కువ, అసలు లేనే లేవు కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వ రుణాలలో కనీసం జాతీయ బ్యాంక్‌ ల తోటి సంబందాలు ఉంటాయి. కాబట్టి అంతో ఇంతో ఇబ్బందులకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ కూడా పేద దళిత, ఆదివాసీల కుటుంబాలు తక్కువ శాతంలోనే ఉంటాయి. ఈ సంస్థల వల్ల మరొక నష్టం ప్రభుత్వాలు, జాతీయ సంస్థలు తమ బాధ్యతలను విస్మరించి పేదలను ఈ రక్తాలు పీల్చే సంస్థలకు ఎరవేసాయి. ఇప్పటికే మహిళలకు ఉన్న సమస్యలు చాలక, ఈ సంస్థల వల్ల ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. సాధికారత అవంటే ఏమిటో చాలా మంది మహిళలకు తెలవదు. అసలు విషయం అర్థం కాక విషం తీసుకొని ప్రాణం బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. పాపం మహిళలు, కుటుంబం, పిల్లలు ఆర్థిక భారం, అప్పుల భారం, సమాజంలో అవమానాలు, ఇంకా ఎన్ని భరించాల్సి వస్తుందో భవిష్యత్‌లో ! ఇప్పటికే పోయిన ప్రాణాలు చాలు, మన ప్రేక్షక పాత్రలు చాలు. చదువుకున్న వాళ్ళుగా మనం సమాజ భాద్యతలు పంచుకునే లవసరం వచ్చింది. లేకపోతే రేపు చరిత్ర మనల్ని క్షమించదు. వెంటనే వేదించే సంస్థలను ఉరి అవతల వరకు తరిమి కొట్టాలి, ఇప్పటొ వరకు తీసుకునకన రుణాలను మాఫీ చేసి మహిళలను అండగా నిలబడాలి. కాలం గడుస్తున్న కొద్ది గడ్డు రోజులు చూడక తప్పట్లేదు. ఇంకా ఎన్ని ఘోరాలకు, చిత్ర హింసలకు వేచి చూడాలో, మహిళలకు ఉన్న కొన్న మంచి లక్షణాలే వారికి శత్రువులేతున్నాయి. ప్రభుత్వాల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. అకాసంలో సగం ఎపుడూ దుఖస్తూనే ఉంటుందా ?

సుజాత సూరేపల్లి