కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ నేడే
` ప్రకటించిన తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం సభలో చర్చ జరుగుతుందన్నారు. ‘’బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆదివారం సభలో పెడతాం. కాళేశ్వరంపై సభలో భారత రాష్ట్రసమితి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజుల తర్వాత సభ నడుపుతాం. గణేష్ నిమజ్జనం, వరదల దృష్ట్యా సభను వాయిదా వేయాలి’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.
బీఏసీ నుంచి భారత రాష్ట్రసమితి వాకౌట్‌బీఏసీ సమావేశం నుంచి భారత రాష్ట్ర సమితి వాకౌట్ చేసింది. ఎరువుల కొరత, వరదలు, రైతుల సమస్యలపై రేపు చర్చ జరగాలని భారత రాష్ట్ర సమితి నేతలు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ రాకపోవడంతో బీఏసీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.