తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం
` సభలో బీసీ రిజర్వేషన్‌పై చట్టసవరణ బిల్లు
` దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్‌కు అసెంబ్లీ సంతాపం
` మాగంటి గోపీనాథ్మాస్ లీడర్ అంటూ రేవంత్ నివాళి
` మండలిలో దివంతగత సభ్యులకు సంతాప తీర్మానం
` ఉభయ సభలు సోమవారానికి వాయిదా
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికై- శాసనమండలి సభ్యులను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. అలాగే ఇటీవల మృతిచెందిన మండలి మాజీ సభ్యులు మాగం రంగారెడ్డికి సభ నివాళి అర్పించిన అనంతరం సోమవారానికి వాయిదే పడిరది. అసెంబ్లీలో మరోవైపు ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సబ సంతాపం ప్రకటించింది. గోపీనాథ్ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి శాససనభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉండేవారని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారని, ఎన్టీఆర్‌కు విశ్వాసపాత్రుడిగా గోపీనాథ్‌కు సత్సంబంధాలు ఉండేవన్నారు. విద్యార్థి నేతగా , ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా రాణించారని చెప్పారు. గోపీనాథ్ తనకు మంచి మిత్రుడని, సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్ తనకు చిన్ననాటి నుంచే మిత్రుడని పేర్కొన్నారు. ఆయన మృతి తనను వ్యక్తిగతంగా తీవ్రంగా కలిచివేసిందని గోపీనాథ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ మాగంటి గోపీనాథ్ జీవన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడని తెలిపారు. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని అన్నారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని.. 1985 నుండి 1992 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ర్రికి తెలుగు యువత అధ్యక్షుడిగా సేవలందించారని తెలిపారు.1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ- డైరెక్టర్‌గా 1988-93లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా విశేష కృషి చేశారు. గోపీ ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడు. సినీరంగంలోనూ నిర్మాతగా రాణించారు. వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్ని-కై- ఘనత సాధించిన వారిలో మాగంటి గోపీనాథ్ ఒకరని అసెంబ్లీలో సీఎం రేవంత్ తెలియజేశారు. చూడటానికి ఆయన క్లాస్ గా కనిపించినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన మాస్ లీడర్ అని అన్నారు. గోపీనాథ్ అకాల మరణం వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు- పేర్కొన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు మాట్లాడుతూ గోపీనాథ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్‌తో తనకు చిరకాల మితృత్వం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. తరవాత కెటిఆర్, ఇతర సభ్యలుఉమాట్లాడుతూ గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడిరది.