అభివృద్దే టిఆర్ఎస్ లక్ష్యం…

సకల సదుపాయాలతో స్మశాన వాటికల అభివృద్ధి…. ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ…

కూకట్ పల్లి జనంసాక్షి :ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీ అన్నారు.గురువారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, శంశిగుడా, కాజా నగర్, ఎన్టీఆర్ నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 2వ ఫేస్, ధరణి నగర్,పంచమి కాలనీ, హెచ్ ఎం టి శాతవాహన నగర్, సాయి చరణ్ కాలనీ ల లో రూ.(372.16 లక్షలు) మూడు కోట్ల డెభై రెండు లక్షల పదహారు వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు స్మశాన వాటికల అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ,కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని అన్నారు.మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,
స్మశాన వాటికలలో సకల సదుపాయాలతో సుందరవనంగా మరో మహా ప్రస్థానం లాగా తీర్చిదిద్దుతామన్నారు.ఈ స్మశాన వాటికలో అంత్యక్రియల ఫ్లాట్ ఫారం, అడ్మినిస్ట్రేషన్ భవనం, మంచి నీటి బోరు ,అంతర్గత రోడ్లు ,టాయిలెట్లు ,వాటర్ ఫౌంటైన్,స్నానాల గదులు,మనిషి జీవిత చరిత్ర సైకిల్ ( మనిషి పుట్టుక నుండి మరణించే వరకు తెలిపే జీవిత చక్రం ను చిత్రాలతో కూడిన గోడను, స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తున్నామని ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని,మనిషి మరణాంతరం చివరి దశలో అంత్యక్రియలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల వసతుల కల్పిస్తున్నామన్నారు.నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, పనులు త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్,ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్ మరియు రాజేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, తెరాస నాయకులు జోగిపేట భాస్కర్ , షౌకత్ అలీ మున్నా, కైసర్, జె.భాస్కర్, బోయా సురేందర్, రవీందర్, అగ్రవాసు, యాదగిరి, రాములుగౌడ్, నరసింహులు, సిద్దయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, జి హెచ్ ఎం సి సిబంది,కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.