అమరుల త్యాగాలు వృథాకావు తెలంగాణ కల సాకరమౌతుంది

నా గెలుపు జయశంకర్‌కు అంకితం: భిక్షపతి
హైదరాబాద్‌, జూన్‌ 18(జనంసాక్షి): తెలం గాణ అమరవీరుల త్యాగాలు వృథా కావని, వారి త్యాగాల స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకు తీరుతామని పరకాల టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు మొలుగూరి భిక్షపతి అన్నారు. ఎమ్మెల్యేగా సోమవారం ప్రమాణ స్వీకారానికి చేసిన అనంతరం ఆయన అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం చేపట్టిన ఉద్యమంలో ఎందరో యువతీయువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని,వారి త్యాగాలు వృథా కావని, తప్పకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు. ఇక ముందు ఎవరూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దనితెలం గాణ అమరవీరులత్యాగాలు వృథా కావని, వారి త్యాగాల స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకు తీరుతామని పరకాల టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు మొలుగూరి భిక్షపతి అన్నారు. ఎమ్మెల్యేగా సోమవారం ప్రమాణ స్వీకారానికి చేసిన అనంతరం ఆయన అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం చేపట్టిన ఉద్యమంలో ఎందరో యువతీయువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగాలు వృథా కావని, తప్పకుండా తెలంగాణ ప్రత్యేకరాష్ట్రాన్నిసాధించుకుంటామన్నారు. ఇక ముందు ఎవరూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా తన గెలుపును తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌కు అంకితమిస్తున్నట్టు భిక్షపతి ప్రకటించారు.

తాజావార్తలు