కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 27 (జనం సాక్షి) : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు కారులో ప్రయాణిస్తుండగా కొడంగల్ నియోజకవర్గం చిట్లపల్లి గేటు దగ్గర ప్రమాదం జరిగింది. బొలెరో కార్ డి కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. రెండు వాహనాలు ఢీకొనగానే కారులో ఉన్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన తండ్రి కూతురును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు మృతి చెందారు. వారి దగ్గర పోలీసులకు ఎలాంటి గుర్తింపు కార్డు దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు ప్రమాదంలో మృతి చెందిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

తాజావార్తలు