మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..?
` కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు
న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాంలో మరింత భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ‘సంవిధాన్ బచావో’ పేరుతో రాంచీ వేదికగా నిర్వహించిన సభలో ఖర్గే ఈ విధంగా స్పందించారు.‘’దేశంలో పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఇంటెలిజెన్స్‌ను పటిష్ఠ పరచుకుంటామని వాళ్లే చెప్పారు. దాడికి మూడు రోజుల ముందే నిఘా సమాచారం ఉందని నాకు తెలిసింది. అలాంటప్పుడు అక్కడ (పహల్గాంలో) తగినంత భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నా ‘’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.ఏదేమైనా పహల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌పై ఎటువంటి చర్య తీసుకున్నా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని మల్లికార్జున ఖర్గే మరోసారి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశమే తొలి ప్రాధాన్యమన్నారు. రాజకీయ విభేదాలకంటే జాతీయ ఐక్యతే ముఖ్యమన్నా రు. ఇక కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఖర్గే.. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడమే మోదీ విధానమని ఆరోపించారు. ఆదివాసీ నేతలను భయపెట్టే ధోరణిని అవలంబించకూడదని కేంద్రానికి సూచించారు.
తెలంగాణ కులగణను అనుసరించండి
` మోడీకి ఖర్గే సుదీర్ఘ లేఖ
న్యూఢల్లీి(జనంసాక్షి):దేశవ్యాప్తంగా కులగణన జరపడానికి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోడీ ప్రభుత్వాన్ని కోరారు. అందరి అభిప్రాయాలతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ మేరకు ఆయన మోడీకి లేఖ రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా కులగణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలంగాణ కులగణన నమూనాను అనుసరించాలని ఖర్గే లేఖలో మోడీ ప్రభుత్వాన్ని కోరారు. తుది కుల గణన నివేదికలో ఏదీ దాచిపెట్టవద్దని.. ప్రతి కులం యొక్క సామాజిక, ఆర్థిక డేటాను ప్రజలకు చేరువలో ఉంచాలి అని ఆయన మోడీ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రిజర్వేషన్లకు సంబంధించిన విషయంపై కూడా ఖర్గే లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 1994 నుండి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో తమిళనాడు రిజర్వేషన్ల చట్టం మాత్రమే రక్షించబడిరది. అదే మాదిరిగా.. ఇతర రాష్టాల్ర్ర చట్టాలను కూడా మన రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని కూడా రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించేందుకు కులగణన సర్వే ద్వారా స్పష్టమవుతుందని ఆయన లేఖలో తెలిపారు. ఈ కులగణన సర్వే ద్వారా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ 15(5)ను అమలు చేయాల్సిన అవసరం నెలకొంటు-ంది అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. న్నత విద్యా శాఖకు గ్రాంట్ల డిమాండ్లపై మార్చి 25, 2025న సమర్పించిన 364వ నివేదికలో విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ- ఆర్టికల్ 15(5)ని అమలు చేయడానికి కొత్త చట్టాన్ని సిఫార్సు చేసిందని ఖర్గే పేర్కొన్నారు.??సామాజిక న్యాయం అనే అంశాన్ని లేవనెత్తినందుకు ప్రధాని మోడీ, ఆయన సహచరులు కాంగ్రెస్‌పై దాడి చేశారు. అయినప్పటికీ మన రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిజ్ఞ చేసినట్లు-గా ఆర్థిక న్యాయం, హోదా, అవకాశాల సమానత్వాన్ని నిర్థారించడానికి కులగణన ఖచ్చితంగా అవసరం అని ఖర్గే నొక్కి చెప్పారు. మన సమాజంలో వెనుకబడిన అణగారిన వర్గాలకు వారి హక్కులను అందించే కులగణన వంటి పక్రియను నిర్వహించడం ఏవిధంగానూ విభజనగా పరిగణించకూడదు అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబానికి రాహుల్ పరామర్శ
హరియాణా(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడిలో కన్నుమూసిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హరియాణాలోని నర్వాల్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..భారత్ వైపు మళ్లీ ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పహల్గాం దోషులను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం విషయంలో కేంద్రానికి ప్రతిపక్షం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.హరియాణాకు చెందిన వినయ్- హిమాన్షి వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. తొలుత హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ నవ జంట.. తమ వీసాలు రిజెక్ట్ కావడంతో జమ్మూకశ్మీర్‌కు వచ్చింది. ఉగ్రదాడితో ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. పెళ్లై వారం కూడా గడవక ముందే.. తన కళ్ల ముందే జీవచ్ఛవంలా మారిన భర్తను చూసి హతాశురాలైంది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతిఒక్కరిని బాధించింది.మరోవైపు పహల్గాం దాడి నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ నర్వాల్ సతీమణి హిమాన్షి విజ్ఞప్తి చేయడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను ట్రోల్ చేశారు. వారి చర్యలను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిరచింది. మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ.. ఆమెపై విద్వేషంతో కూడిన కామెంట్లు చేస్తున్నవారి సామాజిక మాధ్యమ ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.