ఆర్టీసీలో సమ్మె వాయిదా
` ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ
` మంత్రి పొన్నంతో చర్చల అనంతరం జేఏసీ ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఆర్టీసి సమ్మె వాయిదా పడిరది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు- ప్రకటించారు. రేపటి నుంచి రాష్ట్రంలో సమ్మె చేయనున్నట్లు- కార్మిక సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలుపునివ్వడంతో మంగళవారం తమ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. పలు సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్టాడుతూ.. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కార్మిక సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటుందని.. సమ్మె చేస్తే నష్టం జరుగు తుందని చెప్పారు. కార్మికుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం హావిూ ఇచ్చారు. త్వరలోనే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి చెప్పడంతో తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడిరచారు. నేటి నుంచి సమ్మె చేయాలని నిశ్చయించుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జేఏసీ నేతల డిమాండ్లను సమ్మతి తెలపడంతో ప్రస్తుతానికి సమ్మె విరమించుకున్నట్లు వారు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్, నవీన్ మిత్తల్ ఉంటారు. కమిటీ- ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా పరిష్కారం చూపాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. తమ డిమాండ్లను తీర్చకపోతే ఈ నెల మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటు-న్న ఆర్టీసీని సమ్మె ద్వారా దెబ్బతీయవద్దని కోరింది. అలా కాకుండా మొండిగా సమ్మెకు దిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు చేయడం నిషేధం. ఇదిలా ఉంటే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. తమ డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను వాయిదా వేసుకున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె వాయిదా వేస్తున్నట్లు- సచివాలయం విూడియా పాయింట్ వద్ద వెల్లడిరచారు. ప్రభుత్వంతో సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యామని ప్రకటించారు. పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావులతో అనేక అంశాలపై చర్చించినట్లు- పేర్కొన్నారు. ఆర్టీసీ యూనియన్ లపై ఆంక్షల తొలగింపు, అన్ని కేటగిరీల్లో ఖాళీ భర్తీ, గుర్తింపు ఎన్నికల నిర్వహణ, కారుణ్య నియామకాలు , ఉద్యోగ భద్రతపై సర్క్యూలర్, నేరుగా ఆర్టీసీకే ఎలక్ట్రిక్ర్ బస్సులు, 2025 నుంచి రి-టైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపులు, 2017లో రిటైర్ అయిన వారికి వేతన సవరణ ప్రకారం బెనిఫిట్స్ వంటి డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు- తెలిపారు. అలాగే 2019 లో సమ్మె కాలంలో ఉద్యోగులపై వేసిన పోలీస్ కేసులను మాఫీ, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం చేయాలని కోరినట్లు- వెల్లడిరచారు. తమ అని డిమాండ్లను విడతల వారీగా పరిష్కరిస్తామని సర్కార్ హావిూ ఇచ్చిందని పేర్కొన్నారు.
ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కోలుకుంటోంది.. సమ్మెకు వెళ్లొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాల నేతలు మంత్రిని కలిశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కోలుకుంటోందని.. సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కార్మిక సంఘాల నేతలను పొన్నం కోరారు. కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.మరోవైపు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. తల్లిలాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని కోరింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ‘’ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందాం. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుని అభివృద్ధి పథంలోకి వెళ్తోంది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ సంక్షోభంలోకి వెళ్లింది. ఒక వర్గం మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితం కావొద్దు. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా.. విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు’’అని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.