ఉద్యోగులను చులకన చేస్తారా

` సిఎం అనుభవ రాహిత్యం బయటపడుతోంది
` కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది
` కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునేదిలేదు
` ఉద్యోగులను చులకన చేయడం దారుణం
` దుర్మార్గపు సీఎం ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి
` బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. సిఎం రేవంత్‌ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్‌విూట్‌ ఏర్పాటు- చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన పాలనాపరమైన అనుభవ లేకపోయినదాని సూచనగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హావిూలు ప్రజలను మోసం చేసే అబద్ధాలుగా తేలిపోయాయని, తాము ఎప్పటి నుంచో ఢల్లీి పార్టీలను నమ్మరాదని చెబుతున్నామని, రేవంత్‌ రెడ్డి మాటలు దివాలా కోరి వానిలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారం ఉన్నప్పటికీ, పలు హావిూలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేటీ-ఆర్‌ ప్రకారం, ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా కఏక్షలు కీలకంగా కదం తొక్కాయి. వారి పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఉద్యమ నేతలకు గౌరవంగా ఉన్నత జీతాలు కల్పించామన్నారు. రేవంత్‌ రెడ్డి ఉద్యమంలో భాగం కాలేదని, ఉద్యమ ద్రోహిగా వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు మొత్తం 4.15 లక్షల కోట్లకే పరిమితమని, ప్రభుత్వం నుండి విరమించిన సమయంలో ఆదాయం నెలకు 18 వేల కోట్లు- ఉందని వివరించారు. ఇప్పుడూ అదే ఆదాయం వస్తున్నా, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్టాన్న్రి అభివృద్ధి దిశగా నడిపించలేకపోతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అప్పు లెక్కల్ని గందరగోళంగా మార్చుతున్నారని, ఒకసారి 6 లక్షల కోట్లు-, తర్వాత 8.29 లక్షల కోట్లు- అన్నారు అంటూ లెక్కల్లో అస్పష్టత ఉన్నదని చెప్పారు. రైతుబంధు, విద్యుత్‌ సరఫరా, నీటి కొరత వంటి అంశాల్లో కేసీఆర్‌ హయాంలో స్థిరత ఉందని, ఇప్పుడు అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొంది. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్టాన్న్రి అస్తవ్యస్తం చేశారని విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పుడు వారినే ప్రజల ముందుకు విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేటీ-ఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్టాన్న్రి ఆర్థికంగా గాడిలో పెట్టిన కేసీఆర్‌ పాలన తరువాత ఇప్పుడు విపరీత పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఈ పరిస్థితిని గమనిస్తున్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

 

తాజావార్తలు