అమెరికాలో హైదరాబాద్ యువతి మృతి

` స్విమ్మింగ్‌పూల్‌లో పడి మరణించిన ఎల్.బి.నగర్‌కు చెందిన వీణ
` కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికాలో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఓ తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం రేపింది. వర్జీనియాలో నివాసముంటున్న వీణ అనే యువతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. రెండు రోజుల క్రితం ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ప్లోరిడా వెళ్లిన ఆమె.. అక్కడే స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీణ తల్లిదండ్రులు దేవేందర్ రెడ్డి`సునీత ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లో నివాసం ఉంటున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మరణ వార్తతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేరుగా వీణ తల్లిదండ్రులు ఉంటున్న నివాసానికి వెళ్లారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీణ భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హావిÖ ఇచ్చారు. అలాగే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

 

లేగదూడను కాపాడబోయి..
` బావిలో మునిగి తండ్రీకుమారుల మృతి
` ములుగు జిల్లాలో విషాదం..
ములుగు(జనంసాక్షి):ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో మునిగి తండ్రీకుమారులు మృతిచెందారు. గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో ఈ ఘటన జరిగింది. బావిలో పడిన లేగదూడను కాపాడేందుకు వెళ్లి రసపుత్ పవన్ (21) నీట మునిగిపోగా.. అతడిని రక్షించేందుకు యత్నించి తండ్రి రాజు (41) కూడా చనిపోయారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తాజావార్తలు