యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లు

బస్తాలకు లింకులు అంటగడుతున్నారు

నిమ్మకు నీరెత్తినట్టుగాఎవరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

బజార్హత్నూర్/ఇచ్చోడ జూన్ 23( జనం సాక్షి):- మండల కేంద్రంలోని విత్తనం మరియు ఎరువుల డీలర్లు కలిసి రైతుల అవసరాలను ఆసరాగా చేసుకునే యూరియాను ఒక బ్యాగు అసలు ధర 267 ఉండగా, ఎరువులను ఒక్కొక్క బ్యాగుని 320 రూపాయల నుండి 325 రూపాయల వరకు అమ్ముతున్నారు అలాగే యూరియా బస్తాలకు లింకులు అంటగడుతున్నారు. అలా రైతులను ఆర్థికంగా నష్టపరిచిన దాకలలు ఉన్నాయని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న ఒక ప్రకటనలో తెలియపర్చడం జరిగింది.
యూరియాను కానీ పోటాష్, కానీ డిఏపి కూడా అధిక ధరలకు విక్రహిస్తున్న డీలర్ల యొక్క లైసెన్స్ ను రద్దు చేయాలనీ అయన అన్నారు. మరి ముక్యంగా రైతులకు బాసటగా ఉండవలసిన వ్యవసాయ శాఖ వారు మొద్దు నిద్ర పోతున్నారని, ఇదేవిదంగా ప్రత్యేకమైన టాస్క్ పోర్స్ కమిటీ మరియు విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారిస్తుందని అయన దుయ్యబట్టరు. ఇచ్చోడా కేంద్రంగా కొన్ని వందల వేల మంది రైతులు తమ పంట ఎదగడానికి, ఆకుపచ్చగా మరియు ఆక్సీజన్ అందించే విదంగా చూసుకోవడానికి కొన్ని వేల యూరియా బ్యాగులను రైతులు తీసుకున్నట్లు నా యొక్క నిజానిర్దారణలో తేటతెల్లం అయ్యిందని అన్నారు. ఇప్పటికైనా విత్తన ఎరువుల డీలర్లపైన ప్రత్యేక శ్రద్ద వహించి , అదనంగా ఎక్కువు ధరకి అమ్మిన వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . ఇందులో పాల్గొన్న రైతులు
రామకృష్ణ, జయవంత్ రావ్, మహేష్, ప్రహ్లాద్, వెంకట్రావ్, సుగుణబాయి, జంగు బాయి తదితరులు పాల్గొన్నారు.సంగెపు బొర్రన్న రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్…

తాజావార్తలు