నూతన ఎంపీడీవో రఫీ అహ్మద్‌కు ఉప సర్పంచ్‌ల ఫోరం ఘన సన్మానం

మండల అభివృద్ధి, గ్రామాల సమస్యల పరిష్కారంపై చర్చ
సిరికొండ జూన్ 24 (జనం సాక్షి):
సిరికొండ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో రఫీ అహ్మద్‌ను సిరికొండ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, ఉప సర్పంచ్‌ల పాత్ర, గ్రామ పంచాయతీల బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఉప సర్పంచ్‌ల ఫోరం నాయకులు ఎంపీడీవోకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సంపత్ రెడ్డి, ఉపాధ్యక్షులు అయినాల శ్రీకాంత్, గ్యామ శోభన్, ప్రధాన కార్యదర్శి నవీన్, పెద్ద వాల్గొట్ ఉప సర్పంచ్ రాము, చీమన్‌పల్లి ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి, తాటిపల్లి ఉప సర్పంచ్ దేవేందర్, వర్జిన్ తండా ఉప సర్పంచ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు