అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ యువనేత సురేష్ నాయక్..

మహబూబాబాద్ ప్రతినిధి/చిన్న గూడూరు,జూన్ 24 (జనం సాక్షి):
చిన్నగూడూరు మండలం మేగ్యాతండా గ్రామానికి చెందిన బాదావత్ రాములు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ చిన్నగూడూరు మండల సోషల్ మీడియా అధ్యక్షులు, యువనేత బాదావత్ సురేష్ నాయక్ బుధవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాములు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పండ్లు అందజేసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ, కష్టసమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. రాములు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను పరామర్శించడం ద్వారా వారికి మానసిక ధైర్యం కలుగుతుందని, సమాజంలో పరస్పర సహకారం, మానవత్వం పెంపొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గూగులోత్ రఘు, బాదావత్ లక్ష్మణ్, బాదావత్ శ్రీకాంత్, గూగులోత్ వీరన్న, బాదావత్ శ్రీనివాస్, బాదావత్ యశ్వంత్, బాదావత్ రజనీకాంత్, గూగులోత్ పద్మ, బానోత్ మంగ్యా తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు