కుబీర్ మండలం నుంచి పండిత్ జాదవ్‌కు కీలక పదవి

– నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నియామకం
కుబీర్, జూన్ 24, (జనంసాక్షి): కుబీర్ మండలం ఫకీర్ నాయక్ తండాకు చెందిన గిరిజన నాయకుడు పండిత్ జాదవ్‌కు పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయన నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పండిత్ జాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, నియామకానికి సహకరించిన ముఖ్య నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతానని చెప్పారు. మండల స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి, ఎస్టీ మోర్చా బలాన్ని మరింత పెంచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పండిత్ జాదవ్ నియామకం పట్ల కుబీర్ మండల బీజేపీ నాయకులు, ఫకీర్ నాయక్ తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.