ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మహేందర్ ఏకగ్రీవం

మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా చిలువేరు మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
జిల్లా కార్యదర్శిగా నాగపురి కిషన్ గౌడ్ ఎన్నిక
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 23: మండల ఉపసర్పంచ్ పురం అధ్యక్షుడిగా చిలువేరు ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పోరం జనగామ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు పండుగ హరీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన నూతన మండల కమిటీ లో తరిగొప్పుల మండల ఉపసర్పందుల పోరం అధ్యక్షుడిగా తరిగొప్పుల ఉపసర్పంచ్ చిలువేరు మహేందర్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా మూడవత్ రాజుఎర్ర మహేష్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల సురేష్, కార్యదర్శిగా భుక్య రవి, కోశాధికారిగా నీల సంపత్, సలహాదారుడిగా బి. రెడ్డి పాపిరెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పెనుమల్ల రవి, సుంకరి కరుణాకర్, భుక్య మాన్సింగ్, బెజ్జం భవాని తదితరులను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిలివేరు మహేందర్ మాట్లాడుతూ…. మండలంలోని ఉపసర్పంచ్‌లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ఉపసర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఉపసర్పంచ్‌లకు ప్రభుత్వ పరంగా రావలసిన గుర్తింపు, అధికారాల కోసం ఫోరం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఫోరం పోరాటం చేస్తోందని తెలిపారు. “హలో ఉపసర్పంచ్ – చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన నాగపురి కిషన్ గౌడ్ మాట్లాడుతూ…. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, ఉపసర్పంచ్‌ల సంక్షేమం కోసం ఫోరం తరఫున నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.సమావేశంలో మండలంలోని ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, ఫోరం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.



