అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి-రోహిత్

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇవాళ (జులై 9) ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టీ20లో టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్‌, విరాట్‌లు ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ మరో రెండు బౌండరీలు బాదితే టీ20 ఫార్మాట్‌లో 300 ఫోర్ల అరుదైన మైలురాయిని చేరుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో 298 బౌండరీలు ఉన్నాయి.

పొట్టి ఫార్మాట్‌లో 300 బౌండరీల రికార్డు ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ పేరిట ఉంది. స్టిర్లింగ్.. 104 టీ20ల్లో 325 బౌండరీలు బాదాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నెగ్గిన టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోవడంతో టీమిండియా 50 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది.