రెండేళ్ల తర్వాత కూడా కేసీఆర్‌ను నిందిస్తారా?
` కాంగ్రెస్ నేతలు ప్రతిదానికీ ఇంకా ఆయన్నే విమర్శిస్తున్నారు
` హామీల అమలుపై అడిగితే బెదిరింపులా!:కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిరచాలని పార్టీ శ్రేణులను భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కాంగ్రెస్ నేతలు ప్రతిదానికీ ఇంకా కేసీఆర్‌నే నిందిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హైదరాబాద్ షేక్‌పేట డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు చెర్క మహేశ్.. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.