అసోంలో మరోసారి చెలరేగిన అల్లర్లు

అసోం: అసోంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎక్కడ ఎప్పుడేం జరుగుతోంది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈరోజు బస్కా జిల్లా తముల్‌పూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొందరు గుర్తు తెలియని దుండుగులు ఓ బస్సుకు నిప్పు పెట్టారు. సమయానికి అక్కడకు చేరుకున్న పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం రంగంలోకి దిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.