ఆంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు – ఎస్సై ప్రదీప్‌కుమార్‌

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): ఆంకిత భావంతో పనిచేసిన ప్రతి అధికారికి గుర్తింపు లభిస్తుందని ఎస్సై ప్రదీప్‌కుమార్‌ అన్నారు. గతంలో ఇక్కడ విధు లు నిర్వహించి చోప్పదండి బదీలిపై వెళ్లిన వ్యవ సాయ విస్తీరణ అధికారి నారాయణను మండల అద ర్శరైతుల సంఘం ఏర్పటు చేసిన సన్మాన కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఎస్సై ప్రదీప్‌కుమార్‌ పా ల్గోని ఆయన మాట్లాడుతు గత ఆరు సంవత్సరాలుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా పనిచేయడం గర్వనియం అన్నారు. మారుమూల ప్రాంతమైనప్పటికి వ్యాయప్రయాసాలు భరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులు ఆద ర్శరైతులు శాల్వలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో  వ్యవసాయ శాఖ ఇంచార్జీ అధికారి అలివేణి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు బివి స్వామిగౌడ్‌, ఎరువుల దుకాణాల మండల అధ్యక్షులు బాలజీ అదర్శరైతుల మండల అధ్యక్షులు శివకుమార్‌, ఎవోలు యోగిత, మౌనికలు ఉన్నారు.