ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

share on facebook

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి
నల్లొండ,అగస్టు24(జనంసాక్షి): మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే దగ్గర ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 10కి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించారు. ంªఔ39లీ6414 నెంబర్‌ గల ట్రావెల్స్‌ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Other News

Comments are closed.