ఆన్‌లైన్‌లో పాల బుకింగ్‌

ప్రస్తుతానికి బల్క్‌ వినియోగదారులకి
వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్‌
హైదరాబాద్‌ : ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌లో పాలను బుక్‌ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి విశ్వరూప్‌ వెల్లడించారు. పాలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునేందుకు ఏపీ డెయిరీ రూపొందించిన మిల్క్‌సాఫ్ట్‌ అనే వెబ్‌సైట్‌ను సోమవారం ఆయన సచివాలయంలో ప్రారంభించారు. ప్రస్తుతానికి పెద్దమొత్తంలో (బల్క్‌) పాలు అవసరయ్యే వారికి ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ వాసులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. పాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని ఈ సేవ, బ్యాంకు ద్వారా డబ్బు చెల్లించిన వెంటనే పాలను ఇంటి వద్దకు పంపినీ చేస్తారని చెప్పారు. దీనికి అదనపు ఛార్జీలు చెల్లించాల్నిన అవసరం ఉండదని, త్వరలో ఇదే విధానాన్ని తక్కువ ప్యాకెట్ల పాలు అవసరమైన వారు కూడా వినియోగించుకోవచ్చన్నారు.