ఆర్టీసీ బస్సు, కంటైన్‌ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురి మృతి

అద్దంకి: రాష్ట్ర రాహదారిపై చక్రాయపాలెం, కలవకూరుడొంక మధ్య గురువారం ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కిషోర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కండక్టర్‌ అశీర్వాదం సురక్షితంగా బయట పడ్డారు. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన శక్తి క్యారియర్‌ కంటైనర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు.