ఆర్టీసీ బస్‌ చార్జీల బాదుడు

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌22(జనంసాక్షి): రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఛార్జీలు పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఆర్టీసీ భావిస్తోన్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల నుంచి ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పల్లెవెలుగు, మెరుపు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, హైటెక్‌ సర్వీసులకు ఛార్జీలుపెంచేందుకు ఆర్టీసీ నిర్ణయించినట్లు సమాచారం. గతంలోనే గరుడ సర్వీసులకు భారీగా ఛార్జీలు పెంచడంతో ప్రస్తుతం వాటికి మినహాయింపు ఇవ్వనున్నారు. సీటీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.4 నుంచి 5కు పెంచే అవకాశం ఉంది.