*ఆర్ధిక సహాయం అందించిన పూర్వ విద్యార్థినిలు*

కొడకండ్ల,సెప్టెంబర్2 (జనం సాక్షి) కొడకండ్ల మండల కేంద్రంలొని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల & కళాశాల (బాలికలు) నందు సుదీర్ఘ కాలంగా దినసరి వేతనం పై నైట్ వాచ్ మెన్ గా విధులు నిర్వహిన  వీరదాసు సోమయ్య ( కీర్తిశేషులు)అనారోగ్య కారణంగా మరణించారు. ఆరోజున దహన సంస్కారాల నిమిత్తం పాఠశాల సిబ్బంది రూ.15,000/- లను ఇచ్చి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది.  ఈ రోజు పూర్వ విద్యార్థినిలు కూడా అతని కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి తమ వంతు సహాయంగా రూ.50,000/- సోమయ్య గారి భార్య వీరదాసు జయలక్ష్మి గారి పేరు మీద డి సి సి బ్యాంకు కొడకండ్ల బ్రాంచ్ నందు  ఫిక్స్డ్ డిపాసిట్ గా జమచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ రజిని ,పాఠశాల సిబ్బంది మరియు పూర్వ విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది.