ఆలయంలో చోరీ

వడ్డేపల్లి: మండలంలోని రాజోలి గ్రామంలోని భవాని ఆలయంలో అర్థరాత్రి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. కేజిన్నర వెండి ఆభరణాలు, 5గ్రాముల పుస్తెలను దుండగులు దోచుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.