ఆసక్తితోనే జ్ఞాపకశక్తి : కరీం

కరీంనగర్‌్‌, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఏ కరీం అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉర్దూ మీడియం పాఠశాలలో జవహర్‌ బాలసదన్‌, బాల వికాస సమితి, జిల్లా సైకలాజికల్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో బాలల కోసం ‘జ్ఞాపకశక్తి- ఏకాగ్రత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ జీవితంలో బాల్యమే అత్యంత విలువైనద దశ అని, ఈ దశ నుంచే తమ శక్తిసామర్థ్యాలను మెరుగుపర్చుకుంటే బాల్యమే భవితవ్యానికి బాటగా ఉంటుందన్నారు. అంతకు ముందు ఆయన మెదడు, జ్ఞాపకశక్తికి సంబంధించిన పలు అంశాల్లో మానసిక వ్యాయాయం చేయించారు. అనంతరం బాలబాలికలకు మెమొరీ కాంటెస్ట్‌ నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు జూన్‌ 10న జరిగే ముగింపు కార్యక్రమంలో సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస సమితి వ్యవస్థాపకుడు వావిలాల భూపతిరెడ్డి,బాలభవన్‌ పర్యవేక్షకులడు కేవీ గోవిందాచారి, ప్రముఖ లేడీ సైకాలజిస్ట్‌ సమీరా యాస్మిన్‌, ప్రముఖ సంగీత శిక్షకుడు కేబీ శర్మ, సంగెం రాధాకృష్ణ, జాదూ సామ్రాజ్‌ యతిరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.