ఆ పార్టీలు దొందు దొందే !

తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా అభివృధి జ రిగిందా లేక కాంగ్రెస్‌ హయాంలో జరిగిందా అని అనుకుంటాం. ఈ ప్రశ్నకు జవాబుచెప్పే ముందు కాంగ్రెసోళ్లు పాలించిన సమయం,వాళ్లు చేసిన అ భివృద్ధి తెలుగుదేశం పాలన సాగిన టైం, వాళ్ల హ యాంలో జరిగిన అభివృద్ధి బేరీజు వేయవలసి ఉం టుంది మిగిలిన రంగాల జోలికిపోను కానీ, సాగు నీటికి సంబంధించిన పురోగతిని అంచనా వేయ డం, వాటికి మార్కులు వేయడం అంత కష్టం కాక పోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడక పూర్వమే తెలంగాణలో కడెం, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు పూ ర్తయ్యాయి. ఇవి భారీ ప్రాజెక్టుల కోవలో వస్తాయి.

రాజోలిబండ ప్రాజెక్టు హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రారంభమైనా పూర్తియింది ఆంధ్రప్రదేశ్‌ అవత రించాక. ఈ వేళ తెలంగాణలో చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టులు నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, జూరా ల. ఈ మూడు ప్రాజెక్టులు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మొదలైనవే. కనుక ఈ మూడు ప్రాజెక్టుల క్రెడిట్‌ కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మారి తెలుగుదేశం వచ్చి ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించి నా, ప్రాజెక్టుల క్రెడిట్‌ దక్కుతుంది. అంతేతప్ప పూ ర్తిచేసిన వాళ్లకు దక్కదు. అదేవిధంగా శ్రీశైలం హై డ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు పూర్తి చేసిన క్రెడిట్‌ కూడా కాంగ్రెస్‌దే. కాకపోతే పాలమూరుకు రావలసి 174 టీఎంసీల కృష్ణా జాలలను సాధించలేకపోవ డం, జూరాల నిర్మాణం పూర్తయినా పూర్తిగా నింప కపోవడం, రాజోలింబండ నిర్ధారిత పరిమాణం (15.9టీఎంసీల) నీటిని మహబూబ్‌నగర్‌ జిల్లాకు అందజేయలేకపోవడం, సాగర్‌ ఎడమకాలువకు జరిగిన అన్యాయం. ఈ లోపాలన్నిటికి కూడా కాంగ్రెస్‌దే బాధ్యత.

ఇదే విధంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 1963 లో మొదలైనా ప్రథమ దశ పనులు పూర్తిగాక నత్త నడకన సాగడానికి ప్రధానంగా కాంగ్రెస్‌దే బా ధ్యత. ఈ రోజున సింగూరు నిర్మాణం చేసి, దీని ద్వారా ఘనపురం ఆనకట్ట, నిజాంసాగర్‌ ఎండిపో వడానికి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే బాధ్యత. ‘ఇచ్చంపల్లి’ని సాధించుకోలేకపోవడంలో కూడా కాంగ్రెస్‌ ప్రధాన బాధ్యత వహించాల్సిందే. శ్రీరాం సాగర్‌ ద్వితీయ దశకు,వరద కాలువలకు అన్ని ర కాల అనుమతులను సాధించినా నిర్మాణం పను లు సకాలంలో చేపట్టకపోవడానికి కూడా కాంగ్రెస్‌ దే బాధ్యత. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రాజెక్టులు సా ధించినా, నిర్మాణాలు పూర్తిచేసినా, అనేక జాప్యాల కు, జాడ్యాలకు, ప్రాంతీయ వివక్షకు కాంగ్రెస్‌ ప్ర భుత్వాలు కారణమయ్యాయి.

ఇక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేప ట్టిన చెప్పుకోదగ్గ భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఒక్క టి కూడా లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టు లకు శంఖుస్థాపనలు చేయడం, అందమైన తెలు గు పేర్లుపెట్టిడం తప్ప తెలంగాణ ప్రాంతానికి ఒర గబెట్టిందేమీలేదు. ఒక్కశ్రీశైలం ఎడమకాలువ పనులను మంజూరు చేసి తెలుగుగంగకు సరి సమానంగా ప్రారంభిస్తున్నాట్టు ఆర్భాటంగా ప్రకట ించడం జరిగింది. కానీ తెలుగు గంగతో పోలిస్తే ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తిగా నత్తనడకన సాగడా నికి తెలుగుదేశం ప్రభుత్వమే బాధ్యత వహించ వ లసి ఉంటుంది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ఆ లస్యమవుతుంటే ప్రత్యామ్నాయంగా నాగార్జున సా గర్‌ నుంచి ఎలిమినేటి మాధవడ్డి ఎత్తిపోతలు ప్రారంభించిన ఘనత  పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానిదే.

ఒక్క ఏఎమ్‌ఆర్‌ ప్రాజెక్టు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం  గర్వంగా చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టు కనిపించదు.  కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రా రంభించిన  ప్రాజెక్టులను కొనసాగించడం, పూర్తి చేయడం వేరే మాట. టీఆర్‌ఎస్‌ తెలుగుదేశంపైన చేస్తున్న విమర్శలు తట్టుకోలేక హడావుడిగా రాత్రి కిరాత్రి గోదావరి జలాలను ఉపయోగించే దేవా దుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసి కేంద్ర జలసం ఘం నుంచి’ సూత్రప్రాయ అనుమతి ‘ని తీసుకొ చ్చిన క్రెడిట్‌ కూడా తెలుగుదేశానిదే. అయితే ‘దేవాదుల’ తెలుగుదేశం హయాంలో ఒక్కడుగు కూడా ముందుకు సాగులేదు. ఇచ్చంపల్లి, పోలవ రం ప్రాజెక్టుల కోసం కేంద్ర అనుమతులు సాధిం చడం కోసం తీవ్రంగా కృషి చేశారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ టీడీపీ ప్రభు త్వా నికి కేంద్ర మొండిచేయ్యి చూపింది. వివాదా ల నడుమ, తెలంగాణ ప్రజల అభ్యంతరాల మధ్య పులిచింతలను ప్రారంభించింది కూడా చంద్రబా బు హయాంలోనే.

మనం మాట్టాడుకుటున్నది భారీ ప్రాజెక్టుల విషయం మాత్రమే. మధ్యతరహా, చిన్న తరహా హైదరాబాద్‌ ప్రభుత్వంలోనూ, అంతకుముందూ, తెలంగాణదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా ని ర్మించబడ్డాయి. వాటి జోలికి వెళ్లిడం లేదు నిజా నికి చంద్రబాబు హయాంలో ‘సాగునీటి రంగం’పై పెట్టి న కర్చు అతిస్వల్పం. భారీ ప్రాజెక్టులు పూ ర్తిచేయడం ఎవత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్న చంద్రబాబు దృష్టినంతా ‘ నీరు -మీ రు’ కార్యక్షికమంపై పెట్టిన విషయం, కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన  సేద్యం గురి ంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి గొప్పగా చెప్పడానికి ఏమీలేదు. ఇదీ చంద్రబాబు ప్రొగ్రెస్‌ కార్డు. ఇక మనం మాటాకలడుకోవలసిన విషయం వైస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ‘జలయజ్ఞం’ కార్య క్షికమం గురించి. తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టుల లిస్టు చాంతాడంత ఉంది.

తెలంగాణలో మొదలుపెట్టిన భారీ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో కోయిల్‌సాగర్‌, భీమా, నెట్టం పా డు, కల్వకుర్తి,ఎస్‌ఎల్‌బసీ సొరంగం, ఉదయ స ముద్రం, గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌ ద్వితీ యదశ, శ్రీరాంసాగర్‌ వరదకాలువ, ఎల్లంపల్లి, ప్రాణహిత-చేదేవాదుల, కంతనపల్లి, రాజీవ్‌సాగర్‌ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెం, అ లీసాగర్‌, గుత్ప, కాళేశ్వరం, సింగూరు కాలువ ప్రాజెక్టులు. ఇవిగాక అదనంగా ఆధునీకరణ ప్రా జెక్టులు. సుమారు 90 వేల కోట్ల రూపా లవ్యయ ంతో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేప ట్టడం జరిగింది. ఇవన్నీ చూశాక తెలంగాణలో ఎంతో అ భివృధి జరిగిందనిపించడం సహజం. కానీ వాస్త వానికి గుత్ప, అలీసాగర్‌ (ఇవి కూడా స్థిరీకరణ ప్రాజెక్టులు మాత్రమే) తప్పఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఖర్చు సగానికిపైగానే అయ్యింది. రెం డేళ్లలో పూర్తిచేస్తామన్న ఏ ప్రాజెక్టు పూర్తికాలేదు. కాంట్రాక్టులు చేపట్టిన అస్మదీయులు బాగు పడ్డారు. కానీ రైతులకు ప్రయోజనం కలిగింది శూన్యమని ‘కాగ్‌’ నివేదికలే వెల్లిడించాయి. ప్రచా రం కోసం, ఓట్లు దండుకోవడానికి పనికొస్తే రి వొచ్చేమోగాని అనేక వివాదాల మధ్య ఈ ప్రాజె క్టులు ఎప్పుడు పూర్తివుతాయి? తెలంగాణ రైతు లకు నీళ్లు అందుతాయన్నది అనుమానమే.

ఇదిలా ఉంటే తెలంగాణకు భారీనష్టం చే ేకూర్చే అనేక ప్రాజెక్టులు జలయజ్ఞం కార్యక్షిక మంలో భాగంగా వద్దని చెప్తున్నా మొండిగా చేప ట్టారు. ఉదాహరణకు పోలవరం విషయంలో ఒడి షా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఖమ్మం జిల్లా గిరిజను లు రెండు లక్షల మంది నిర్వాసితులవడం, వారి జీవనోపాధి,ఉనికి కోల్పోవడం జరుగుతున్న కార ణంగా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని చెప్తు న్నా.. ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న పాపం కాంగ్రెస్‌ ప్ర భు త్వానిది. అన్నిటికన్నా ఘోరం తెలంగాణ భవిష్యత్‌ తరాలకు గోదావరి, కృష్ణా నదులను దూరం చేసే కుట్రకు ప్రధాన సూత్రధారి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ‘పోతిడ్డిపాడు’ హెడ్‌ రెగ్యులేటర్‌ సైజును నాలుగింతలు పెంచి 30 రోజుల్లేనే 120 టీఎంసీ ల కృష్ణా జలాలను ‘వరద జలాల’పైరిట రాయల సీమ, ఆంధ్రప్రాంతాలకు తలలించే ప్రయత్నానికి ఆద్యుడు వైఎస్‌. ఇందుకోసం ముందుగా శ్రీశైలం రిజర్వాయర్‌ను విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి బహు ళార్థసాధక ప్రాజెక్టుగా మార్చి జీవో 107 ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌ కనీస నీటి మట్టాన్ని 54 అ డుగులకు పెంచడం లాంటి అనేక చర్యలతో తన పన్నాగం పారడానికి దారి సుగమం చేసుకు న్నాడు. కృష్ణా జలాలను క్రమంగా తెలంగాణకు ద ్కకుండా చేసే మరో ప్రయత్నమే అవసరంలేని దుమ్ముగూడెం-నాగార్జునసాగర్‌ ‘టెయిల్‌పాండ్‌’ 169 టీఎంసీల గోదావరి జలాలను వరదజాలాల ముసుగులో కృష్ణా బేసిన్‌కు తరలించి, వాటితో సా గర్‌ అవసరాలు తీర్చి, కృష్ణా జలాలను సునా య సంగా ‘పోతిడ్డిపాడు’ ద్వారా తరలించడంలో భా గంగా జరిగిన ఈ కుట్ర వెనకాల ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్‌. ఆయన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి కా బట్టి ఆ పార్టీయే తెలంగాణ వనరుల దోపిడికీ బా ధ్యత వహించవలసి ఉంటుంది. నేడు జంట నగ రాల తాగునీటిని కృష్ణా నది నుంచి కాకుండా, గో దావరి నుంచి తీసుకు వస్తామనడానికి అజలైన కారణం కృష్ణా జలాలను సీమాంధ్రకు తరలిం చాలన్న ఏకైక లక్ష్యమే.

ఎంత తెలివిగా ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలం గాణను మోసం చేసిందంటే ‘కృష్ణా బేసిన్‌లో ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులకు కేవలం 77.50 టీఎంసీల అదనపు జలాలను కేటాయిం చి, 150 టీఎంసీలను బేసిన్‌లో లేని సీమాంధ్రకు తరలించే ప్లాన్‌కు అనుమతి ఇచ్చింది. ఆయన సా రధ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి  30 రోజుల్లో నీరు వదలాని, తెలంగాణ  ప్రాజెక్టులకు 90 రోజుల్లో వదలవచ్చని రూలు పెట్టింది. బయటి ప్రపంచాని కి తెలంగాణను అద్భుతంగా అభివృధ్ధి చేస్తున్నామ ని ప్రాజెక్టుల సందడి వినిపించి ‘కాసుల పంట’ పండించుకుని, వెనకాల కృష్ణా,గోదావరి  జాలాల ను సీమాంధ్ర ప్రాంతాలను తరలిస్తూ, తెలంగాణ ను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడింది. దీనికి కాంగ్రెస్‌ పార్టీయే బాధ్యత వహించాలి. చేసింది వైఎస్‌ అయినా,తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎ మ్మెల్యేలు, మంత్రులు అందరూ ఈ పాపంలో భా గస్వాములే.కనుక వైఎస్‌ఆర్‌ హయాంలో తెలంగా ణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు. మంత్రులు అం దరూ ఈ పాపంలో భాగస్వాములే.కనుక వైఎస్‌ అయినా, తెలంగాణకు జరిగిన లాభం కంటే హాని ఎంతో ఎక్కువ. కాబట్టి వైఎస్‌ ప్లస్‌ల కంటే మైన ప్‌లే ఎక్కువ. నా దృష్టిలో వనరులను దోచి, తెలం గాణను వెనుకబడేయటానికి చంద్రబాబు ఎంత బాధ్యుడో, తెలంగాణను శాశ్వతంగా ఎడారిగా మార్చడానికి ‘జలయజ్ఞం’ ముసుగులో నాటకాలా డిన వైఎస్‌ అంతకన్నా  రెట్టింపు బాధ్యత వ హించాల్సిందే. తెలంగాణ విషయంలో ఇటు తెలు గుదేశం,లటు కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ద్రోహం చేశాయి.అందుకే ‘దొంగ-దొందే’.

నదుల అనుసంధానం – సుప్రీం ఆదేశం

ఇటీవలే సుప్రీంకోర్టు నదుల అనుసంధానం ప్రక్రియను  సాకారంచేయడం కోసం అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేసిం ది. అందులోభాగంగా ఒక ‘ ప్రత్యేకమైన కమిటీ’ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని పురమాయిం చింది. ‘నదుల అనుసంధానం ఎంతో ప్రయోజ నం కలిగిస్తుందన్న కేంద్రం అభిప్రాయంతో ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప అన్నీ ఏకీభవిస్తున్నాయి. అ నుసంధానం వల్ల కలిగే దుష్పరిణామాల అపోహ లను నిపుణులు ఎంతో సమర్థవంతగా తిప్పికొట్టా రు. వ్యవసాయ, ఇతర రంగాలలో ఈ అనుసంధా న ప్రక్రియ ఎంతో పురోగతిని సాధించగలుగుతుం ది. సుప్రీం కోర్టు అభిప్రాయం ఎలా ఉన్నా వాస్త వానికి తమిళనాడు, రాజస్థాన్‌ వంటి ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప నదుల అనుసంధానాన్ని ఏ రాష్ట్ర మూ సమర్థించడం లేదు. తమ అవసరాలకు మిం చి తమ నదులలో జలాలన్నాయని ఏ రాష్ట్రమూ ఒ ప్పుకోవడానికి సిద్ధంగా లేదు.

బయటికి ఏం చెప్తున్నా బాగా నీళ్లున్నాయని కేంద్రం నమ్మే బ్రహ్మపుత్ర, గంగానదులకు సంబం ధించి, ఈశాన్య, ఉత్తర భారత రాష్ట్రాలు కానీ, మ హానదికి సంబంధించిన ఒడిషా కాని, గోదావరికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ కానీ, అరేబియా స ముద్రంలో కలిసే నదీ బేసిన్లు కలిగిన కేరళ కానీ ఈ నదుల అనుసంధాన ప్రక్రియను అంగీకరించే స్థితిలో లేవు. రాజ్యాంగ పరంగా నీళ్లపైన కేంద్రా నికి హక్కు లేనంత కాలం ఇలాంటి ఎన్ని కమి టీలు వేసినా, సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ఒరిగేది శూన్యమే.