ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్‌:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన ‘తరతరాల స్త్రీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది.ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ అతిత్వరలో ఉందంటున్నారు. ఐఏఎస్‌ అధికారులపై మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత మన్నారు. ఈ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని చెప్పారు. సమాజ అభివృద్ధికి ఆడవాళ్లు పడుతున్న కష్టాలను, వారి విలువల తెలియజెప్పేలా ఉమారాణి పుస్తకాన్ని రచించారన్నారు. తెలుగు అకాడమీ విడుదల చేసిన ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీస్‌ భాషల్లో రూపొందించారు.