ఇంటర్ స్పాట్ అడ్మిషన్ల కొరకు.

తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల కళాశాల.

బూర్గంపహాడ్ సెప్టెంబర్03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 2021-23 విద్యా సంవత్సరానికి ఇంటర్ బైపిసి, ఎంపిసి ప్రథమ సంవత్సరంలో ఈ నెల 6వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జి.అనిత 01-09-2022 గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా. టి. యస్. ఆర్. జె.సి. ప్రవేశ పరీక్షలో పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థినులు స్పాట్ అడ్మిషన్కు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు 06-09-2022న మంగళవారం ఉదయం 10-00 నుండి సాయంత్రం 4:30 గం. వరకూ అడ్మిషన్లకు సరైన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.