ఇది పర్లపల్లి మహిళ గర్జన

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పర్లపల్లి గ్రామం తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. ఓ చరిత్రను తనకు తాను లిఖించుకుంది. కరీం నగర్‌ జిల్లాకు పోరాటాలు కొత్త కాదు. ఎందుకంటే, ఈ జిల్లాకు పోరాట వారసత్వం ఉంది. ఇక్కడి ప్రజలకు నాయకత్వ లక్షణాలు పుష్కలం. ఓ వైపు సాహిత్యం, కళలకి పుట్టినిల్లుగా ఉంటూనే ఉద్య మాలకు కేంద్రబిందువుగా తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్న జిల్లా ఇది. తెలంగాణను పోరాటాల నుండి వేరు చేసి చూడలేం. ఇదే ఇక్కడి ప్రాంత ప్రత్యేకత. కరీంనగర్‌ నుండి పర్లపల్లికి పోయే దారిలో చుట్టూ కొండలుంటే, అందులో ఒక్కో కొండది ఒక్కో చరిత్ర. గుట్టకూ పుట్టకూ ఓ దేవుడుంటాడిక్కడ, పల్లె పల్లెకూ దేవతలుం టారు. అలాంటి పల్లెల వంటిదే పర్లపల్లి కూడా. మొన్నటి వరకు ప్రశాంతంగా బతికిన పర్లపల్లికి 2009లో తమ బతుకులకు చిద్రం చేసేందుకు ఓ ముప్పు ‘హరిత’ పేరుతో వస్తుందని, దాన్ని ఎదుర్కోవ డానికి తాము పోరుబాట పట్టాల్సి వస్తదని ఆ సమయంలో పర్లపలి ్లవాసులకు తెలియదు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ ముప్పు రానే వచ్చింది. వాళ్లను సాధించుకు తిన్నది. 2012 జూన్‌ 27న వందల కొద్దీ మహిళలు, పురుషులు, గ్రామం మొత్తం దండులా కదిలి ఆ హరిత బయోప్రొడక్ట్స్‌ కంపెనీ మీద తిరగబడ్డరు. కంపెనీ వస్తువులు, వాహనాలపై దాడి చేశారు. ఇది మామూలు ముచ్చట కాదు. గత సంవత్సరంగా వాళ్లు అనుభవిస్తున్న కోపం, బాధ మోసపోయిన భావన నింగిని తాకింది. యాజమాన్యం, పోలీసులు కంపెనీ సెక్యూ రిటీ గ్రామస్తుల తిరుగుబాటుపై మోకరిల్లక తప్పలేదు. చిన్నపుడెపుడో ‘మా భూమి’ సినిమాలో గడి మీద దండు కదిలినట్టు కదిలిన దృశ్యం కళ్ల ముందు మెదలాడింది. ఇక్కడ ప్రజలే స్వయంగా తమ సమస్యల మీద ఒక అవగాహనకి వచ్చి, తమంతట తాము ఒక్కతాటిపైకి వచ్చి కదిలిన సందర్భమది. ఈ ప్రపంచీకరణ యుగంలో, నేను, నాదిలో పూర్తిగా మునిగి ఉన్న మధ్య తరగతే ప్రపంచం అనుకున్న వాళ్లకి అర్థం కాని విషయం, మింగుడు పడని వాస్తవం ఈ సంఘటన.
అసలు కథలోకి వస్తే హరిత బయోప్రొడక్ట్స్‌ కంపెనీ 2009లో ఇథనాల్‌ తయారు చేసే కంపెనీగా అడుగుపెట్టింది. ఎక్కడ నుంచో ఇక్కడికి వచ్చిన దొరలకి కరీంనగర్‌ మక్కలపై, మానేరు నీళ్లపై కన్నుపడ్డది. తెలంగాణలో మొట్టమొదటి గ్రైన్‌ మీద ఆధారపడి ఇథనాల్‌ తయారు చేసే కంపెనీ ఇది. నూకలు, మక్కలతో ఇథనాల్‌ తయారు చేసి, ఆల్కహాల్‌, మందుల తయారీకి దీనిని పంప ిస్తామని యాజమాన్యం చెబుతోంది. ఇక్కడ నుండి పశువులకి దానా కూడా తయారు చేస్తారంట! అగస్ట్‌ 18, 2009లో పర్లపల్లి బడిలో కాలుష్య నియంత్రణ ఇంజినీర్‌, ప్రభుత్వాధికారుల, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రజాభిప్రాయసేకరణ జరిగినట్టు, అంతకన్నా ఒక నెల ముందు, పత్రిక ప్రకటన ఇచ్చినామని యాజమాన్యం, కంపెనీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి వినిపించారు. కానీ, ఊరు ఊరంతా కూడా ఒక్కటై అది బూటకమని మొత్తుకుంటున్నారు.
పర్లపల్లిలో ఏం జరిగింది ? మొదటి నుంచి కూడా ఊరి కార్యదర్శి, సర్పంచి ఇంకా కొంత మంది దళారులు కలిసి అది బి స్కట్‌ కంపెనీ అని, ఇక్కడ బ్రెడ్‌ కూడా తయారై, ఊర్లో అందరికీ ఉద్యోగాలొస్తాయని నమ్మించారు. అదే విధంగా కేవలం కంపెనీ పేరు మీద వివరాలు ఏమి లేకుండా తీర్మానం చేసినారు. పెద్ద హడా విడి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభం కానిచ్చారు. అలా మొదలైన కంపెనీ తమ జీవితాల్లో కాలుష్యం చిమ్ముతుందని కలలో కూడా అనుకోలేదని ఒక అవ్వ ఆవేదన. పచ్చని పంట పొలాల మధ్య 30 ఎకరాల్లో సర్వే నెంబర్‌ 1130, 1131(పి), 1132, 11 33, 1134 (పి) పర్లపల్లిలో సెక్షన్‌ 25 నీటి 1974 మరియు సెక్షన్‌ 21 ఆక్ట్‌ 1981 కింద రెక్టిఫైడ్‌ స్పిరిట్‌, ఎథనాల్‌, ఫార్మగ్రేడ్‌ అల్క హాల్‌, ఇండస్ట్రీయల్‌ ఆల్కహాల్‌ తయారీకి కాలుష్య నియంత్రణ మం డలి అనుమతిచ్చింది. అయితే, దీనికి 2 మెగా వాట్ల కరెంట్‌, రోజుకి 5 లక్షల లీటర్ల నీరు, దాదాపు 4000 టన్నుల మక్కలు కూడా అవస రం. కేవలం 30 ఎకరాలకు అనుమతినిస్తే ఈ కంపెనీ దాదాపు వం ద ఎకరాలు కొనుక్కున్నరు.
మొత్తం మోసంతో మొదలైన కంపెనీ పెట్టిన రోజు నుం చే మొదలైంది కాలుష్యం, చుట్టుపక్కల భయంకరమైన దుర్గంధం, మెల్లిగా ప్రజలు లొల్లిపెట్టడం, ఆ ఊరి పెద్దలు నచ్చచెప్పడం కొన్ని రోజులు జరిగింది. ఆ తరువాత ఆరోగ్యాలు పాడు కావడం, పిల్లలకు కామెర్లు, స్త్రీలకి అబార్షన్లు, చర్మ వ్యాధులు ఎక్కువ కావడం ప్రజలకు నిద్ర లేకుండా చేశాయి. అనేకసార్లు ప్రభుత్వాధికారులకు, ప్రతినిధు లకు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఎవరూ పట్టించుకున్న పాపా న పోలేదు, రాజకీయ పార్టీలు మొదటి నుంచి కూడా ఏమి తెలియ నట్టే ఉన్నాయి. అయితే, కంపెనీ నడవడానికి లక్షల కొద్దీ నీరు లభిం చడం కోసం కంపెనీ చుట్టూ పక్కల ఉన్న బావులను, బోర్లను కిరా యికి తీసుకోవడం మొదలు పెట్టినారు. పెద్ద రైతులకి ఇది లాబ óసాటిగానే ఉన్నది. కానీ, భరించలేని వాసనకి మాత్రం ఏమి చేయ లేకపోతున్నారు. చుట్టూ నల్గొండ, పీచుపల్లి, ముల్కనూర్‌, సర్లపల్లి, మొగిలిపాలెం, మొలంగూర్‌ పల్లెలు కూడా కాలుష్యం బాట పటా ్టయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. చిన్నపిల్లలు మధ్యాహ్న భోజన సమ యంలో వాసనకు వాంతులు చేసుకుంటున్నారని ఆషా వర్కర్లు వివరించారు.
దాదాపు అరవై కోట్ల కంపెనీకి కేవలం 150 మంది వర్కర్లను చుట్టుపక్క గ్రామాల నుంచి తీసుకున్నరని చెపుతున్నారు. వాళ్లు ఎంత మందికి ఉద్యోగాలిచ్చినా కూడా ఉండలేకపోతున్నామని ఊరిలో ఎవరిని కదిలించినా ఒకటే మాట. చూసి చూసి ఆ రోజు అందరు పోవడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు కొట్టుకుంటూ తీసుకు పోయినారు. ఇది జరిగింది జూన్‌ 28 నాడు, అక్కడి నుంచి ఫ్యాక్టరీకి పోయి వివరాలు సేకరించాము.
సాయంత్రం తిమ్మపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మా కమిటీతో అధికారులు కొద్దిగా మాట్లాడారు. వాళ్లను చూస్తే జాలి, కోపం, ఆవేశం తన్నుకు వస్తున్నాయి. ప్రజలు డబ్బులు తీసుకొని పెట్టుకో నిచ్చారు, ఇపుడు వాళ్ల చేతిలోకి లాని తీసుకుంటున్నారు, మేము ఊరుకోము, వారి చర్యలు హింసాయుతంగా ఉన్నాయని అడిషనల్‌ ఎస్పీ గారు సెలవిచ్చారు. హింస అంటే కేవలం ప్రజలు తమ బాగు కోసం, ఊరి కోసం, పర్యావరణం కోసం పోట్లాడితే వారు దళా రులని పోలీసువాళ్లు నమ్మిస్తారు. అందరికి అదే చెప్తారు, అది చూసి ప్రజలు సంఘాల వారి దగ్గరకు రారని వారి నమ్మకం.
ఊర్లో ఉన్న 70 మహిళా సంఘాలోల్లు ఒకే మాట, మా భర్తలు, పిల్లలను, మమ్ములను ఎంత హింసించినా కూడా మేము పోరాటం ఆపేది లే దు. ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్న వాళ్లని ఆది శక్తులని, అపర కాళికలని ఏమంటారో తెలియదు గానీ, వారి ఆగ్రహం ముందు ప్రభుత్వం ఓడిపోయింది. ప్రస్తుతం తాత్కాలికంగా మూసి వేసినారు. కానీ, ప్రజలు, ప్రభుత్వాలపై నమ్మకాలను పోగొట్టుకు న్నారు. స్త్రీల ముందు ఏ అధికారి తట్టుకోగలుగుతారు ? రాత్రి అయి తున్నా కూడా అదరకుండా, బెదరకుండా ఉన్న ప్రజలు, సంఘాలు తమ నిరసనని వివిధ రూపాల్లో తీసుకున్నారు. రాత్రంతా తిమ్మాపూ ర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో, జాతీయ రహదారిపై కూర్చున్నారు.
నిజానికి ఇక్కడ మహిళలు లేకపోతే ఇంత తీవ్రంగా పోరాటం జరిగేది కాదు. పోలీసులు, ప్రజాప్రతినిధులపై వారికి నమ్మకం పో యింది. కొద్ది మంది మగవాళ్లు కూడా లేకపోలేదు గానీ, నాయ కత్వంలో ఉంది మాత్రం మహిళలే. గ్రామీణ ప్రజలకు పేగుబంధం వంటిది భూమితో సంబంధమని కొద్ది మందికే తెలుసు. భూమి లేని నీరు పేదలకి కూడా అన్నం పెట్టేది భూమే. ఇప్పటి తరం కూలీ నాలీకి పట్టణాలకు పోయినా భూమి లేకపోతే దిగాలుపడి మంచాన పడ్డ వాళ్లు కూడా ఉన్నారు. గత సంవత్సరం మేడంపల్లి గుట్టలకి పర్మిషన్‌ తీసుకున్నపుడు, క్వారీలను తవ్వేటపుడు కూడా స్త్రీలే కదిలారు. అపుడు అన్నారం గుట్టలపై తిరగబడ్డది కూడా ఈ గ్రామస్తులే, మహిళలే. అదే విధంగా బద్దిపల్లిలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో కదిలి తమ గుడిని కాపాడుకోగలిగారు.
ఎక్కువ చదువు లేకున్నా ముందూ వెనక గొప్ప పేరున్న సంఘాలు లేకున్నా, మహిళలు విజయం సాధించారు. కలెక్టర్‌ గారి చొరవతో కాలుష్య మండలి, కలెక్టర్‌ బృందం పర్యటించి వెంటనే కం పెనీని మూసేయడం, కాలుష్య మండలి చర్చకు పిలవడం అతి త్వర గా జరిగాయి. ఈ నెల హైదరాబాద్‌ కాలుష్య మండలి కార్యాల యంలో, మెంబర్‌ సెక్రటరీ జయచంద్ర, ఐఏఎస్‌ ఆధ్వర్యంలో గ్రామ స్తులు, తెలంగాణ భూమి రక్షణ సంఘంగా మేము, ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం ప్రతినిధులు, కలెక్టర్‌ కార్యాలయం ప్రతి నిధులు, కాలుష్య సాంకేతిక నిపుణులు, యాజమాన్యంతో సమా వేశం నిర్వహించారు.
అక్కడ గ్రామస్తులు కుండ బద్దలు కొట్టినట్టు మేము ఎట్టి పరిస్థితిలో కంపెనీకి అనుమతినివ్వమని, చివరి వరకు పోరాడతామని తెల్చేశారు. కాలుష్యం చిమ్ముతున్న వైనం, నీటి దోపిడి, మోసం చేయడం, పర్యావరణ కాలుష్యం గురించి మేము ప్రజా సంఘాలుగా సాక్ష్యాధారాలతో వివరించాము. కంపెనీ వాళ్లు విధి లేక నీళ్లు నమిలి అన్ని చర్యలు తీసుకుని ముందుకు నడు స్తామని చెప్పినా కూడా వారి వాదన నెగ్గలేదు. ఎందుకంటే, కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం అన్ని రకాల కాలుష్యం చిమ్ముతూ, పరిమితులను, జాగ్రత్తలను పాటించకుండా ఆ కంపెనీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని అర్థమైంది కాబట్టి. వాద ప్రతివాదనలు విన్న తరువాత ఈ కంపెనీని తాత్కాలికంగా మూస ివేసి, వ్యర్థ పదార్థాలని తీసివేయాలని అదేశాలిచ్చారు.
కంపెనీ పై స్థాయికి పోవచ్చు కానీ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండి, పోలీసు వ్యవస్థను తమ చేతిలో ఉంచుకున్న కంపెనీని ప్రజలు ఎదుర్కొని మూసి వేయించడం నిజంగా పెద్ద విజయం. సిగ్గు లేని ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, పంట పొలాల నాశనానికి, నీటి దోపిడికి కారణమౌతున్న కంపెనీకి వెన నుండి మద్దతునివ్వడం కొసమెరుపు. ఏ ఒక్క పేరున్న నాయ కుడు రాలేదు పలకరించేందుకు. విధి లేక ఒకరిద్దరు వచ్చినా వారు చేసిందేమీలేదు. ప్రజలు వినే స్థితిలో, వారి లాగా అమ్ముడు పోయే స్థితిలో లేరని అర్థం చేసుకున్నారు.
వనరుల దోపిడిని ప్రశ్నించకుండా తెలంగాణ ఉద్యమం లేదు, ప్రజల బాగోగులని పట్టించుకోకుండా డైలాగులకే పరిమిత మయ్యే నాయకులుగా భావించిలేము. ప్రజల పోరాటానికి మద్దతు తెలుపుదాం. తెలంగాణ వనరులను కాపాడుకుందాం. గ్రామాలను సస్యశ్యామలంగా పదిలంగా ఉండేట్లు చూసుకుందాం..

– సుజాత సూరేపల్లి.