ఇద్దరు చిన్నారులు బలిగొన్న తుంపి వాగు
విశాఖ (అరుకు): వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అరకులో చోటు చేసుకుంది. అరకు లోయకు చెందిన బాలరాజు(10) కారుకొండ శివప్రసాద్ (6)లు మరో ఇద్దరు చిన్నారులతో కలసి స్నానం చేసేందుకు సమీపంలోని తుంపి వాగులోకి దిగారు. స్నానం చేస్తుండగా వారు వూబిలో చిక్కుకుపోవడంతో మృతి చెందారు. బంధువులు, స్థానికుల సాయంతో మృతి దేహాలను వెలికితీశారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.