ఇధనాల్‌ పరిశ్రమఏర్పాటుకు మరోసారి అభిప్రాయ సేకరణ

విజయనగరం, ఆగస్టు 2 : జిల్లాలోని పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి వద్ద ఇధనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఆర్డీఒ రాజకుమారి వెల్లడించారు. ఆగస్టు 1న ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు సంబంధించి ఇప్పలవలస, నడిపల్లి, కెంగువ పేట, గ్రామాల ప్రజలకు బహిరంగ విచారణకు సమావేశాన్ని నిర్వహించారు. అయితే అన్ని గ్రామాల నుంచి సాయంత్రం వరకు జరిగిన అభిప్రాయ సేకరణలో పూర్తి స్థాయి బాధ్యులు రానందున మరోసారి గ్రామాల వారిగా అభిప్రాయ సేకరణ చేస్తామని ఆమె గురువారం తెలిపారు. దాదాపు యాభైకోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పలువురు ఈ పరిశ్రమను వ్యతిరేకించగా, మరికొంతమంది ఈ పరిశ్రమను స్వాగతిస్తున్నారు. యాజమాన్యం కూడా కాలుష్య రహితమైన ఈ మధ్యతరహా పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రభుత్వానికి మంచి జరుగుతుందని ఖచ్ఛితంగా చెబుతుంది.