ఇన్నోవేటర్ కరపత్రాలను ఆవిష్కరుంచిన జిల్లా కలెక్టర్…

జనగామ కలెక్టరేట్ జూలై 6(జనం సాక్షి): జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశములో ఇన్నోవేటర్ కరపత్రాలను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం మంచి అవకాశమని ప్రతి గ్రామంలో వారి వారి వృత్తులు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకొని పనిని సులభతరం చేసుకునేందుకు వారు చేసిన అతి చిన్న ఆలోచన, వస్తువు కూడా పోటీకి అర్హమై జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.చిన్న, పెద్ద, చదువు, డిగ్రీలతో సంబంధం లేకుండా తమ ఆలోచనలకు గుర్తింపు పొందే అరుదైన అవకాశాన్ని అన్ని వర్గాల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి రామ్ రెడ్డి, విద్యాశాఖ అధికారి రాము, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ గౌసియా, ఈడీఎం దుర్గారావు తదితరులు ఉన్నారు.