ఈడి బీడీలకుభయపడేది లేదు
ఏంపీక్కుంటారో పీక్కోండి
పిట్లo బహిరంగ సభలో కేటిర్ సవాల్
కామారెడ్డి బ్యూరో,మార్చి15, (జనంసాక్షి),
ఈడి బీడిలకు భయపడేది లేదని, ఏం పీక్కుంటారో పీక్కోoడని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, మున్సిపాలిటీ శాఖామాత్యులు కేటిఆర్ అన్నారు.ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రము లో 25 కోట్లతో మంజీర నది పైన నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, రూ. 478 కోట్లతో.. 40 వేల ఎకరాలకు సాగు నీరందించే “నాగమడుగు ఎత్తిపోతల పథకం”శంకుస్థాపన చేసిన అనంతరం పి ట్లం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.మోడీ దేవుడిని బండి సంజయ్ అంటుంటాడని మోడీ ఎవడికి దేవుడని కేటిఆర్ ప్రశ్నించారు. మోడీ గ్యాస్ సిలిండర్,పెట్రోల్, డీజిల్, పప్పు, చింతపండు ధరలు పెంచి ప్రజల నద్దివిరిచాడని విమర్శించారు. కాంగ్రెస్ హాయంలో 400ఉన్న గ్యాస్ సిలిండర్ ధర మోడీ హాయంలో 1200రూపాయలు అయ్యిందన్నారు. ప్రజలను దోచి మోడీ దోస్త్ ఆదానికి జేబులు నింపుతున్నాడని ఆరోపించారు. మోడీ ఆదానికి దేవుడని ప్రజలకు కాదని అన్నారు.మోడీ ప్రభుత్వం తెలంగాణా పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని,నిదులు ఇవ్వడంలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండని తెలంగాణ ను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను అడుగుతున్నాడని కేటిఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ప్రజలు పదిసార్లు ఛాన్స్ ఇచ్చారని ఏం అభివృద్ది చేశారని ప్రశ్నించారు.కాంగ్రెస్ 50యేళ్ళ పాలనలో రాష్ట్రంలో విద్యుత్తు, సాగునీరు,ఇలా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నామనితెలిపారు.అప్పుడు కరెంట్ వస్తే వార్త. ఇప్పుడు కరెంట్ పోతేవార్త అనిఆయన అన్నారు. నీళ్ళు,నిదులు, నియామకాల కోసం కేసీఆర్ ఉద్యమం చేసిండని తెలిపారు.నేడు కేసిఆర్ అధ్వర్యంలో తెలంగాణా అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కరాష్ట్రాలైన కర్నాటక,మహారాష్ట్రలో లేవని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్,జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్,జుక్కల్ ఎ మ్మే ల్యే హన్మంత్ షిండే, ఏమ్మెల్ల్యే గణేష్ గుప్త,కామారెడ్డి జడ్పీ ఛైర్మన్ దఫెదార్ శోభరాజు, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎ మ్మె ల్ల్యే సురేందర్, ఎంఎల్ సి రాజేశ్వర్,కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, అదికారులు ,ప్రజా ప్రతినిదులు ,బిఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.