ఈడీ పిటీషన్‌పై విచారణ 28కి వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ను విచారణకు అనుమతించాలన్న ఈడీ పిటీషన్‌ పై విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 28కి వాయిదా పడింది. అలాగే ఎమ్మార్‌ కేసు నిందితుడు కోనేరు ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.