ఈనెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్ రవితో కేసీఆర్ భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్ రవితో తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై మరోమారు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయ ఈనెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్ రవితో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కవాతు నిర్వహణ తేదీలోపే కేంద్రం తెలంగాణపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని వయలార్ రవిని కోరే అవకాశం ఉంది.



