ఈ నెల 20 భారత్‌ బంద్‌: వెంకయ్యనాయుడు

ఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 20న భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ప్రకటించారు. అవినీతి యూపీఏ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణం అవినీతిని పక్కదారి పట్టించేందుకే ఎఫ్‌డీఐల ప్రకటన అని ఆయన ఆరోపించారు.