ఉచిత శిక్షణ తరగతులు….ఉచిత శిక్షణ తరగతులు..


శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లాలోని  గవర్నమెంట్ ఐ. టి.ఐ  కళాశాలలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్  ఉచిత శిక్షణ తరగతులు . ఈ కార్యక్రమంలో జే. సి. ఐ మంచిర్యాల ప్రెసిడెంట్ జే సి  రాజు అరుముళ్ల,  మరియు జే సి కరీంనగర్ ఫెమిపవర్ ప్రెసిడెంట్ జేసీ కవిత విశిష్ట అతిధులుగా, కళాశాల ప్రిన్సిపాల్ ఎం. చందర్, డాక్టర్ రాజా రమేష్ జి. ఆస్. ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ట్రైనింగ్ ఆఫీసర్ జే. సి వై.రమేష్, జే. సి వెంకటేశ్వర్లు, కే. రాజారెడ్డి  ఈ కార్యాక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ చందర్  మాట్లడుతూ ఇలాంటి గొప్ప అవకాశం  ఉపయోగించుకుని  భవిష్యత్ ని తీర్చి దిద్దుకోవాలాని అని అన్నారు.
జేసీ డాక్టర్ రాజారమేష్  మాట్లాడుతూ జే. సి.ఐ వారు ఇస్తున్నా ఉచిత శిక్షణ కార్యక్రమాన్నీ  ప్రతీరోజు హజరూ అవుతూ,శిక్షణ లో మంచి నైపుణ్యాలను నేర్చుకుంటూ  ఉద్యోగం  సాధించే దిశగా గా అడుగులు వేయమన్నారు, తన వంతుగా దూరం నుండి వచ్చే విద్యార్థులకు భోజన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి జేసీ రాజు  మాట్లాడుతూ తెలంగాణ లో మొట్ట మొదటిసారిగా ఉచిత జూనియర్ లైన్ మెన్ తరగతులు నిర్వహిస్తున్నారు అని చెప్పారు, మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంతటా 500 పైగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మొదటి రోజు 54 మంది విద్యార్థులు హాజరు అయ్యారు అని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి సహకరించిన కళశాల యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ గన్రాజ్, జేసీ వెంకటేష్, రాజేందర్, రియాజ్, శంకర్, మరియు కళశాల స్టాప్ పాల్గొనడం జరిగింది…………జనం సాక్షి