ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో విద్యుత్ పునరుద్దరణ
ఢిల్లీ: ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో అధికారులు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. ఐదు ప్రాంతాల్లోనూ నూరు శాతం విద్యుత్ సరఫరా పునరుద్దరించినట్లు ప్రధాన పంపిణీ సంస్థ ప్రకటించింది. సోమవారం అర్థరాత్రి ఉత్తరాది గ్రిడ్ వైఫల్యంతో మొదలైన విద్యుత్ కష్టాలు మంగళవారం మరో రెండు గ్రిడ్‌లు కూడా విఫలం కావడంతో ప్రజలు నరకాన్ని చూశారు. సుమారు 21రాష్ట్రాల్లో 60కోట్ల మంది కరెంటు కష్టాల తీవ్రతను చవిచూశారు. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. సరఫరా పునరుద్ధరణతో ప్రజలు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు.