ఉత్తర తెలంగాణలో భారీ వర్ష సూచన
` వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్,సెప్టెంబరు 20(జనంసాక్షి): నగరంలో రానున్న గంటపాటు మొస్తరు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు సూచించింది.సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి, చిలకలగూడా, మారెడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్, ప్యారడైస్, అల్వాల్‌లో వర్షం మొదలైంది. నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.