ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారు: సీఎల్పీ

హైదరాబాద్‌: వరసగా మూడో రోజు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా శాసనసభ వాయిదా పడడం విచారకరమని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం అభిప్రాయపడింది. ఉద్దేశ పూర్వకంగానే విపక్షాలు సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ జరగడానికి సహకరించకుండా మాక్‌ అసెంబ్లీ పేరిట సభా గౌరవాన్ని తగ్గించడం ఏ మేరకు సబబని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. కనీసం మిగిలిన మూడు రోజులైనా సభ సజావుగా సాగేందుకు  సహకరించాలని కోరారు.