ఉపాధ్యాయురాలు వేసిన శిక్షతో బలిగొన్న ఒక విద్యార్థి
హైదరాబాద్: క్రమశిక్షణ పేరుతో ఉపాధ్యాయురాలు వేసిన శిక్ష ఒక విద్యార్థి ప్రాణాలు తీసింది. రాజధానిలోని మాదన్న పేట సమీపంలోని రాయల్ ఎంబీసీ పీఠశాలలో ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 3న పాఠశాలకు వచ్చిన మహ్మద్ ఇస్మాయిల్ అనే విద్యార్థి తరగతి గదిలో అల్లరి చేశాడని ఉపాధ్యాయురాలు 600 సార్లు గుంజీళ్లు తీయించింది. దీనివల్ల విద్యార్థి అస్వస్థతకు గురవగా వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. శిక్ష విధించడం వల్లే విద్యార్థి చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థి బంధువులు పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వసం చేశారు. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



