ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

ఎస్‌టియు డిమాండ్‌
కడప, జూలై 30: జిల్లాలో ఖళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్‌టియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్‌టియు ఆధ్వర్యంలో సోమవారం కడప కల్టెరేట్‌ ఎదుట, పొద్దుటూరు తసిల్ధార్‌ కార్యలయం వద్ద ధర్నాలు జరిగాయి. కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో ఎస్‌టియు జిల్లా ప్రధానకార్యదర్శి సురేష్‌బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మున్సిపాలిటి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతలు కల్పించాలని కోరారు. ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల విద్యాభివృద్ధి కుంటుపడుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వానిక ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పొద్దుటూరు తాసిల్దార్‌ కార్యలయం వద్ద జరిగిన ధర్నాలో ఎస్‌టియు నాయకులు సుబ్బారాయుడు పాల్గొన్నారు.