మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి 28 (జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎస్సైలు ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనంగా మారింది. మానసిక వత్తుళ్ళ లేక వ్యక్తిగత సమస్యల వేధింపుల తెలియదు కానీ తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శనివారం పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో జరిగింది. మహిళా జిల్లా ఎస్పీ ఉన్న పోలీస్ శాఖలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కారణాలు ఏమైనా జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం మొదటిది. వివరాల్లోకి వెళ్ళితే వికారాబాద్ జిల్లా కో ట్ పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ దివ్య శనివారం నాడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ అయినప్పటికీ ధరూర్ సీఐ రైటర్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ మేరకు ఆమె ఇంట్లో ఎవరు లేరు సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు వికారాబాద్ సిఐ రఘు కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ రఘుకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యపన పడినట్లు తెలియజేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. సంఘటన స్థలంలో ఒక లేఖ దొరికిందని అందులో నాన్న లేకపోవడం వల్లనే తమ కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చాయని రాసినట్లు తెలియజేశారు. ఆత్మహత్య చేసుకోవడంలో ఎవరి ప్రమేయం లేదని లేఖలు పేర్కొన్నట్లు తెలియజేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కానిస్టేబుల్ దివ్యకు ఆదివారం రోజు పెండ్లి చూపులు ఉన్నట్లు తెలియజేశారు. ఈ పెండ్లి తనకి ఇష్టం లేదని కానిస్టేబుల్ దివ్య తల్లితో తెలియ చేసింది. పోలీస్ శాఖ లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ దివ్య ను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కానీ ఆ కానిస్టేబుల్ తో పెళ్లి చేసుకోవడానికి కానిస్టేబుల్ దివ్యకు ఇష్టం లేదు. ఈ విషయమై దివ్య కుటుంబ సభ్యులకు తెలియ చేసింది. కానీ కుటుంబ సభ్యులంతా పెండ్లికి దివ్య ఒప్పించే ప్రయత్నం చేశారు. శుక్రవారం రాత్రి దివ్య పెండ్లి విషయమై కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరిగింది. తర్వాత గదిలో నిద్రపోవడానికి వెళ్ళిన దివ్య శనివారం తెల్లవారు రామన్న ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ ఉద్యోగం తనకి ఇష్టం లేదని డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ విషయమై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని వికారాబాద్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు జరుగుతుంది.



